ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు
దేశంలో ఇకపై భారత అత్యున్న న్యాయస్ధానం ఇచ్చే తీర్పులు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి.సుప్రీం కోర్టు అదనపు భవన సముదాయాన్ని రాష్ట్రపతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందీతో పాటు మరో 5 ప్రాంతీయ భాషలు తెలుగు, అస్సామీ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువడనున్నట్టు చెప్పారు. ఇదే కార్యక్రమంలో ఇప్పటివరకు సుప్రీం కోర్టు చెప్పిన 100 తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా […]
దేశంలో ఇకపై భారత అత్యున్న న్యాయస్ధానం ఇచ్చే తీర్పులు ప్రాంతీయ భాషల్లో అందుబాటులోకి రానున్నాయి.సుప్రీం కోర్టు అదనపు భవన సముదాయాన్ని రాష్ట్రపతి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో హిందీతో పాటు మరో 5 ప్రాంతీయ భాషలు తెలుగు, అస్సామీ, కన్నడ, మరాఠీ, ఒరియా ప్రాంతీయ భాషల్లో తీర్పులు వెలువడనున్నట్టు చెప్పారు.
ఇదే కార్యక్రమంలో ఇప్పటివరకు సుప్రీం కోర్టు చెప్పిన 100 తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా బుధవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గగోయ్, న్యాయశాఖమంత్రి రవిశంకర్ ప్రసాద్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ కుమార్ దోవల్,పలువురు న్యాయమూర్తులు, సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.