శ్రీలంక పేలుళ్లలో 295 చేరిన మృతుల సంఖ్య

ఈస్టర్ పండగ సందర్భంగా లంకలో నిన్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో తెగబడ్డారు. మొత్తం 8 ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 295 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 500 మందికిపైగా తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక నిరవధిక కర్ఫ్వూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. ఈ పేలుళ్లకు సంబంధించి 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి […]

శ్రీలంక పేలుళ్లలో 295 చేరిన మృతుల సంఖ్య
Follow us
Ravi Kiran

|

Updated on: Apr 22, 2019 | 11:43 AM

ఈస్టర్ పండగ సందర్భంగా లంకలో నిన్న ఉగ్రవాదులు బాంబు పేలుళ్లతో తెగబడ్డారు. మొత్తం 8 ప్రాంతాల్లో బాంబులు పేల్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ పేలుళ్లలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటి వరకు మొత్తం 295 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. 500 మందికిపైగా తీవ్రగాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. ఇక నిరవధిక కర్ఫ్వూను ఎత్తివేస్తున్నట్లు శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. మరోవైపు.. ఈ పేలుళ్లకు సంబంధించి 24 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.