దేశ ప్రజలారా ఐక్యంగా ఉండండి- శ్రీలంక ఆర్థిక మంత్రి

శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆర్థిక మంత్రి మంగల సమరవీర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా మానవీయ కోణంలో ఆలోచించి బుద్దిస్టులు, క్రిస్టియన్లు, హిందు, ముస్లింలంతా.. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కులాలు, మతాలను పక్కనపెడితే.. మనమంతా మనుషులం అని, ఆ స్ఫూర్తిని ఇప్పుడు చాటాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 207 కు చేరింది. దేశ శాంతి […]

దేశ ప్రజలారా ఐక్యంగా ఉండండి- శ్రీలంక ఆర్థిక మంత్రి
Ram Naramaneni

|

Apr 21, 2019 | 7:52 PM

శ్రీలంక పేలుళ్ల నేపథ్యంలో దేశ ప్రజలంతా ఐక్యంగా ఉండాలని ఆర్థిక మంత్రి మంగల సమరవీర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కుల, మతాలతో సంబంధం లేకుండా మానవీయ కోణంలో ఆలోచించి బుద్దిస్టులు, క్రిస్టియన్లు, హిందు, ముస్లింలంతా.. క్షతగాత్రులకు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కోరారు. కులాలు, మతాలను పక్కనపెడితే.. మనమంతా మనుషులం అని, ఆ స్ఫూర్తిని ఇప్పుడు చాటాల్సిన అవసరం ఉందని అన్నారు. మరోవైపు పేలుళ్లలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 207 కు చేరింది. దేశ శాంతి భద్రతలపై శ్రీలంక ప్రభుత్వం ఎప్పటికప్పడు సమీక్షలు నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతోంది. ప్రభుత్వం నుంచి తదుపరి ప్రకటన వచ్చేవరకు కర్ఫ్యూ కొనసాగనుంది. సహాయక చర్యలు, వివరాల కోసం ప్రభుత్వం హాట్ లైన్స్ ఏర్పాటు చేసింది. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ : 011 2 322 485 (పోలీస్), 011 2 323 015 (టూరిస్ట్ సమాచారం)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu