శ్రీలంక పేలుళ్లపై ట్రంప్ రాంగ్ ట్వీట్..సోషల్ మీడియాలో ట్రోలింగ్

ఏదైనా షాకింగ్ విషయంపై స్పందించేటప్పుడు.. తొందరపాటులో తప్పులు దొర్లడం సహజం. అయితే ఇది సోషల్ మీడియా కాలం కదా.. ఏ చిన్న తప్పు దొర్లినా నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తుంటారు. శ్రీలంకలో జరిగిన మారణకాండను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన.. రాంగ్‌ ట్వీట్‌తో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. ట్రంప్‌ ట్వీట్‌ చేసే సమయానికి దాడుల్లో మృతుల సంఖ్య 138. ఐతే.. ఏకంగా 138 మిలియన్లు చనిపోయినట్లు  పోస్ట్‌ […]

శ్రీలంక పేలుళ్లపై ట్రంప్ రాంగ్ ట్వీట్..సోషల్ మీడియాలో ట్రోలింగ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 21, 2019 | 8:29 PM

ఏదైనా షాకింగ్ విషయంపై స్పందించేటప్పుడు.. తొందరపాటులో తప్పులు దొర్లడం సహజం. అయితే ఇది సోషల్ మీడియా కాలం కదా.. ఏ చిన్న తప్పు దొర్లినా నెటిజెన్స్ తీవ్రంగా ట్రోల్ చేస్తుంటారు. శ్రీలంకలో జరిగిన మారణకాండను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖండించారు. ట్విట్టర్ వేదికగా విచారాన్ని వ్యక్తం చేసిన ఆయన.. రాంగ్‌ ట్వీట్‌తో తీవ్రమైన ట్రోలింగ్‌కు గురయ్యారు. ట్రంప్‌ ట్వీట్‌ చేసే సమయానికి దాడుల్లో మృతుల సంఖ్య 138. ఐతే.. ఏకంగా 138 మిలియన్లు చనిపోయినట్లు  పోస్ట్‌ చేశారు. పొరపాటును గుర్తించిన ఆయన.. వెంటనే దాన్ని సరిచేసినా అప్పటికే దానికి వేల సంఖ్యలో రీట్వీట్లు అయిపోయాయి. తప్పుడు సంఖ్య ఉన్న ట్వీట్‌ను డిలీట్ చేసి, అసలు సంఖ్యతో ఆయన మరో ట్వీట్‌ చేసినా.. ముందు చేసిన ట్వీట్‌ స్కీన్‌ షాట్‌తో ఆయన్ను ట్రోల్‌ చేస్తున్నారు నెటిజన్లు. జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఒమర్‌ అబ్ధుల్లా కూడా ఈ ట్వీట్‌ను రీట్వీట్‌ చేశారు. ఇటువంటి సున్నీతమైన అంశాలపై స్పందించేటప్పడు జాగ్రత్త లేకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు.