పుడమితల్లిలో ఐక్యమైపోయిన యుగపురుషుడు

మహానుభావుడు మరిలేరు. ఇక సెలవంటూ గానగంధర్వుడు పుడమితల్లిలో ఐక్యమైపోయారు. ప్రపంచ చరిత్రలోనే ప్రముఖమైన, అపురూపమైన గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో, పోలీస్ గౌరవ వందనాలతో, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రు నివాళుల మధ్య ఆయన స్వర్గానికి చేరిపోయారు. చెన్నై శివారులోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలుకి అంతిమ సంస్కారాలు అత్యంత నిబద్ధతో, సాంప్రదాయాలతో నిర్వహించారు. బాలు కుమారుడు చరణ్‌, కుటుంబ సభ్యులు శ్రౌత శైవ ఆరాధ్య సాంప్రదాయ ప్రకారం మహనీయునికి అంతిమ […]

పుడమితల్లిలో ఐక్యమైపోయిన యుగపురుషుడు
Follow us
Venkata Narayana

|

Updated on: Sep 26, 2020 | 1:34 PM

మహానుభావుడు మరిలేరు. ఇక సెలవంటూ గానగంధర్వుడు పుడమితల్లిలో ఐక్యమైపోయారు. ప్రపంచ చరిత్రలోనే ప్రముఖమైన, అపురూపమైన గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమిళనాడు ప్రభుత్వ లాంఛనాలతో, పోలీస్ గౌరవ వందనాలతో, సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానుల అశ్రు నివాళుల మధ్య ఆయన స్వర్గానికి చేరిపోయారు. చెన్నై శివారులోని తామరైపాక్కం ఫాంహౌస్‌లో బాలుకి అంతిమ సంస్కారాలు అత్యంత నిబద్ధతో, సాంప్రదాయాలతో నిర్వహించారు. బాలు కుమారుడు చరణ్‌, కుటుంబ సభ్యులు శ్రౌత శైవ ఆరాధ్య సాంప్రదాయ ప్రకారం మహనీయునికి అంతిమ క్రతువు నిర్వహించారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ పెద్ద సంఖ్యలో అభిమానులు రావొద్దని కోరినా బాలును కడసారి చూసేందుకు ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున ఫాం హౌస్ కు చేరుకుని తమ అభిమాన గాయకుడికి కన్నీటి వీడ్కోలు పలికారు.

ఓ ‘బాలు’డా… నీకు మరణమా…? ఎంతమాత్రం లేదంటూ బాలు  అంత్యక్రియల్లో నేరుగా పాల్గొనలేకపోయిన అభిమానులు నెట్టింట్లో కోటి గొంతుకలై వెలుగెత్తుతున్నారు. మీరు భౌతికంగా మా మధ్యలేకున్నా నీ గళం నుంచి వెల్లువై పెల్లుబికిన గానం ఎల్లప్పటికీ తమతోనే ఉంటుందంటూ ధీమాగా చెబుతున్నారు. కోట్లాదిమంది బాలు అభిమానులు ఆయన అంతిమ యాత్రను టీవీల్లో చూసి బాధాతప్త హృదయులయ్యారు. మా ఉచ్చ్వాస నిశ్వాసాల నుండి హృదయాంతరాళాల్లోకి దూకి మరీ నీ గానం మా రక్తనాళాల్లో ప్రవహిస్తూనే ఉంటుందంటూ నెటిజన్లు తమ సోషల్ మీడియా అకౌంట్ల సాక్షిగా మహాపురుషునిపై తమకున్న గౌరవభావాల్ని పలువురితో పంచుకుంటున్నారు. నీ శకం ముగిసి ఉండవచ్చు గాక.. అంతం కాని నీ కీర్తికి ఇది నాంది ప్రస్థావన అంటూ నిబ్బరంగా నివాళులర్పిస్తున్నారు.