హైదరాబాద్ ప్రజలకి నిశ్చింతగా ఆస్తి హక్కులు: కేటీఆర్
హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా కొత్త రెవెన్యూ చట్టం దోహదపడుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నమని ఆయన తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జంటనగరాల్లోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం […]
హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా కొత్త రెవెన్యూ చట్టం దోహదపడుతుందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలన్నదే టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రయత్నమని ఆయన తెలిపారు. జిహెచ్ఎంసి పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపైన కేటీఆర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో జంటనగరాల్లోని వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల, సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాల గురించి.. వాటి ఆవశ్యకత గురించి ప్రజాప్రతినిధులతో కేటీఆర్ ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
ఈ అంశాలపై అవసరమైతే క్యాబినెట్ ద్వారా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని కేటీఆర్ ఈ సందర్భంలో చెప్పారు. భవిష్యత్తులో హైదరాబాద్ లోని ఆస్తుల క్రయ విక్రయాల్లో ఇబ్బందులు లేకుండా చూడడం జరుగుతుందన్నారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలని కేటీఆర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేయాలని కేటీఆర్ మార్గనిర్దేశం చేశారు.