అర్థరాత్రి ఒంటిగంటకి అవంతి బావ ఫోన్లు

హైదరాబాద్ చందానగర్ పరువు హత్యలో ప్రాణాలొదిలిన హేమంత్ మర్డర్ కేసులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవంతి బావ కృష్ణ మోహన్ హేమంత్ తండ్రి మురళికి కాల్ చేసిన ఆడియో సంచలనంగా మారింది. ‘హేమంత్ నా దగ్గర 2 లక్షల రూపాలయల డబ్బు అప్పు తీసుకున్నాడు. ఫోన్ లో అందుబాటులో లేడు… అడ్రెస్ చెప్తారా?’ అంటూ అవంతి బావ హేమంత్ తండ్రికి ఫోన్ చేశాడు. ‘ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా హేమంత్ నా […]

అర్థరాత్రి ఒంటిగంటకి అవంతి బావ ఫోన్లు
Follow us
Venkata Narayana

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Sep 26, 2020 | 3:01 PM

హైదరాబాద్ చందానగర్ పరువు హత్యలో ప్రాణాలొదిలిన హేమంత్ మర్డర్ కేసులో అనేక కొత్త అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. అవంతి బావ కృష్ణ మోహన్ హేమంత్ తండ్రి మురళికి కాల్ చేసిన ఆడియో సంచలనంగా మారింది. ‘హేమంత్ నా దగ్గర 2 లక్షల రూపాలయల డబ్బు అప్పు తీసుకున్నాడు. ఫోన్ లో అందుబాటులో లేడు… అడ్రెస్ చెప్తారా?’ అంటూ అవంతి బావ హేమంత్ తండ్రికి ఫోన్ చేశాడు. ‘ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి మధ్యవర్తిత్వం ద్వారా హేమంత్ నా దగ్గర అప్పు తీసుకున్నాడు.. హేమంత్ అడ్రెస్ తెలుసుకొని సమాచారం ఇవ్వండి’ అంటూ మరోసారి ఫోన్ చేసి హింసించినట్టు సమాచారం. అదీ అర్థరాత్రి ఒంటిగంట సమయంలో అవంతి బావ ఈ వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది.

మరో సారి తప్పతాగి అవంతి బావ కృష్ణ మోహన్.. హేమంత్ తండ్రికి కాల్ చేసి అడ్రస్ చెప్పవే అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. కృష్ణ మోహన్ ప్రస్తుతం పరారిలో ఉన్నాడు. ఇలా ఉండగా, హేమంత్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. యూకే నుండి వచ్చిన హేమంత్ సోదరుడితోపాటు, బంధువులు, స్నేహితులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదిలా ఉంటే, తమకు ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించాలంటూ హేమంత్ భార్య అవంతి పోలీసులకు గతంలో ఫిర్యాదు చేసిన కాపీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పోలీసుల అలసత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.