బాలికపై ఏడాదిగా ముగ్గురు కామాంధుల లైంగికదాడి
కామాంధుల కర్కశత్వానికి ఓ బాలిక ఏడాదిగా బలైంది. ముగ్గురు కీచకుల కూరత్వానికి బాలిక గర్భం దాల్చింది. కర్నాటకలో అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

కామాంధుల కర్కశత్వానికి ఓ బాలిక ఏడాదిగా బలైంది. ముగ్గురు కీచకుల కూరత్వానికి బాలిక గర్భం దాల్చింది. కర్నాటకలో అలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.కర్ణాటక రాష్ట్రంలోని ఎలమంచిలి జిల్లా కొత్తలి గ్రామానికి చెందిన ఓ బాలిక(15) తల్లిదండ్రులు చిన్నతనంలోనే చనిపోయారు. దీంతో ఆమె తాతయ్య, అమ్మమ్మ వద్ద ఉంటోంది. అమ్మమ్మ, తాతయ్యలు కూలి పనికి వెళ్తుండడంతో బాలిక చదువు మధ్యలోనే మానేసి ఒంటరిగా ఇంట్లో ఉండేది. ఇంటి వద్ద ఒంటరిగా ఉండే బాలకపై అదే ప్రాంతంలో కూలీ పనులు చేసుకునే ముగ్గురు యువకుల కన్నుపడింది. మాయమాటలతో బాలికను లొంగదీసుకుని ముగ్గురు కామాంధులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఇదే అదునుగా బాలికను బెదిరిస్తూ ఏడాది కాలంగా అఘాయిత్యానికి పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.
ఇదిలావుంటే, బాలిక శరీరంలో మార్పులు వస్తుండడాన్ని గమనించిన అమ్మమ్మ ఆస్పత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షించి ఆరు నెలల గర్భవతి అని తేల్చడంతో కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. దీంతో బాలికను నిలదీయగా అసలు విషయం వెల్లడించింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం బాలికను అనకాపల్లి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.




