కౌలు రైతుకు రైతుబంధు సాధ్యం కాదు: కేసీఆర్
హైదరాబాద్: రైతు బంధు పథకం కౌలు రైతుకు అందడం లేదంటూ వస్తున్న విమర్శలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కౌలు రైతుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ పథకానికి కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోమని తెలిపారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో సంబంధం లేకుండా రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చెక్కులను నేరుగా అందిస్తామని, వడ్డీ భారం లేకుండా వడ్డీతో కలిపి […]
హైదరాబాద్: రైతు బంధు పథకం కౌలు రైతుకు అందడం లేదంటూ వస్తున్న విమర్శలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కౌలు రైతుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ పథకానికి కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోమని తెలిపారు.
కేంద్రం ఇచ్చే డబ్బులతో సంబంధం లేకుండా రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని వెల్లడించారు. రైతులకు రుణమాఫీ చెక్కులను నేరుగా అందిస్తామని, వడ్డీ భారం లేకుండా వడ్డీతో కలిపి రుణమాఫీ చెక్కులను అందిస్తామని అన్నారు. సాగునీటి ప్రాజెక్టుల కోసమే అప్పు చేస్తున్నామని విపక్షాల విమర్శలకు సమాధానం ఇచ్చారు. తెలంగాణ నుంచి కేంద్రానికి రూ. 50 వేల కోట్లకు పైగా వెళుతున్నాయని, కానీ అక్కడి నుంచి మాత్రం కేవలం రూ. 24 వేల కోట్ల వరకు మాత్రమే వస్తున్నాయని కేసీఆర్ విమర్శించారు.