బ్రేకింగ్ : కాలిన గాయాలతో చికిత్స పొందిన ఆర్టీసీ డ్రైవర్ మృతి

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆందోళన చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ శనివారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన ఆయన హైదరాబాద్ కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్టీసీ కార్మిలకు సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం మొండివైఖరితో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్ధాపంచెందాడు. దీంతో శనివారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను కాపాడే ప్రయత్నంలో శ్రీనివాసరెడ్డి కొడుకు కూడా […]

బ్రేకింగ్ : కాలిన గాయాలతో చికిత్స పొందిన ఆర్టీసీ డ్రైవర్ మృతి
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Ram Naramaneni

Updated on: Oct 13, 2019 | 12:28 PM

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో భాగంగా ఆందోళన చేస్తున్న ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీనివాసరెడ్డి అనే డ్రైవర్ శనివారం కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాల పాలైన ఆయన హైదరాబాద్ కంచన్‌బాగ్ డీఆర్డీవో అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆర్టీసీ కార్మిలకు సమ్మెకు వ్యతిరేకంగా ప్రభుత్వం మొండివైఖరితో శ్రీనివాసరెడ్డి తీవ్ర మనస్ధాపంచెందాడు. దీంతో శనివారం సాయంత్రం కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనను కాపాడే ప్రయత్నంలో శ్రీనివాసరెడ్డి కొడుకు కూడా గాయాలపాలయ్యాడు. శ్రీనివాసరెడ్డి మ‌ృతితో ఆస్పత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆర్టీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు చేరుకున్నారు. రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో బంద్‌కు అఖిలపక్ష పార్టీలు పిలుపునిచ్చాయి.

ఆర్టీసీ డ్రైవర్  శ్రీనివాస్ రెడ్డి  మృతి చెందారన్న వార్త తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్  ఆవేదన వ్యక్తం చేశారు.  శ్రీనివాస్ రెడ్డి మృతి పట్ల బిజెపి రాష్ట్ర శాఖ తరపున సంతాపం తెలియజేశారు.   ఆర్టీసీ కార్మికులకు భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఎవరూ  ధైర్యం కోల్పోవద్దన్నారు. అదే విధంగా సీపీఐ నేత నారాయణకూడా తన సంతాపాన్ని తెలియజేశారు. అంత సంయమనం పాటించాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విఙ్ఞప్తి చేశారు.