రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇన్నోవా కారు -లారీ ఢీ.. ఆరుగురు దుర్మరణం

రంగారెడ్డి చేవెళ్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.  తెల్లవారుజామున బోర్‌వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. చేవెళ్ల మండలం కందవాడ శివారులోని టర్నింగ్ వద్ద బోర్‌వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది.

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..  ఇన్నోవా కారు -లారీ ఢీ.. ఆరుగురు దుర్మరణం
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 02, 2020 | 12:18 PM

రంగారెడ్డి చేవెళ్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది.  తెల్లవారుజామున బోర్‌వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. చేవెళ్ల మండలం కందవాడ శివారులోని టర్నింగ్ వద్ద బోర్‌వెల్ వాహనాన్ని ఇన్నోవా కారు ఢీకొట్టింది. దీంతో  కారు ముందు భాగం పూర్తిగా దెబ్బతిన్నది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 11మంది ఉన్నారు. వీరిలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. మరో ఇద్దరు సేఫ్ గా బతికి బయటపడ్డారు.

అయితే కారులో మృతదేహాలు ఇరుక్కుపోవడం.. ప్రమాద తీవ్రతను తేటతెల్లం చేస్తోంది. బాధితులంతా హైదరాబాద్ తాడ్ బండ్ ప్రాంతానికి చెందినవారిగా గుర్తించారు.కారు అతివేగం కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని వివరాలు ఆరాతీస్తున్నారు. కారులో నలుగురు పురుషులు, నలుగురు మహిళలతో పాటు ముగ్గురు చిన్నారులు ఉన్నారు. చనిపోయిన వారిలో ఓ పురుషుడితో పాటు నలుగురు మహిళలు ఓ చిన్నారి ఉన్నారు. డ్రైవర్ అసిప్ ఖాన్ తో పాటు మెహెక్ శాంతా, నజియా బేగమ్, హార్ష్, నజియా భాను, హర్ష భానులు చనిపోయినట్టు పోలీసులు గుర్తించారు.