మహబూబాబాద్ జిల్లా పసిబాలుడి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు సాగర్

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన దీక్షిత్ హత్య కేసులో నిందితుడు సాగర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

మహబూబాబాద్ జిల్లా పసిబాలుడి మర్డర్ కేసులో కొత్త ట్విస్ట్.. ఆత్మహత్యకు యత్నించిన నిందితుడు సాగర్
Follow us

|

Updated on: Dec 02, 2020 | 8:49 AM

మహబూబాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన దీక్షిత్ హత్య కేసులో నిందితుడు సాగర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పైసల కోసం తొమ్మిదేళ్ల పసిబాలుడ్ని పొట్టన పెట్టుకున్నాడు.. ఇప్పుడు అతను ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు. వరంగల్‌ సెంట్రల్ జైల్‌లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న నిందితుడు మందా సాగర్ బలవన్మరణానికి యత్నించాడు. జైలులో పవర్ స్విచ్‌బోర్డును తాకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

నిందితుడు సాగర్‌కు గాయాలు కావడంతో వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు జైలు సిబ్బంది. సాగర్‌ను పరిశీలించిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని తేల్చారు. మహబూబాబాద్‌లో 9ఏళ్ల బాలుడు దీక్షిత్‌ను కిడ్నాప్‌ చేసి అతి దారుణంగా హతమార్చాడు సాగర్. అక్టోబర్ నెలలో జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది.

అక్టోబర్ 18న కృష్ణకాలనీలో అడుకుంటున్న దీక్షిత్‌ను అదే ప్రాంతానికి చెందిన మందా సాగర్ మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశాడు. బైక్‌పై వచ్చిన సాగర్ అప్యాయంగా పలకరిస్తూ.. బాలుడ్ని కిడ్నాప్ చేసి దారుణానికి ఒడిగట్టాడు. కేసముద్రం మండలం అన్నారం దానమయ్య గుట్టపై గొంతు నులిమి హత్యచేశాడు. ఆ తర్వాత పెట్రోలు పోసి దహనం చేశాడు. హత్యచేశాక కూడా కిడ్నాపర్‌కు డబ్బు ఆశ చావలేదు. కిడ్నాప్ చేసిన రాత్రి 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో బాలుడి తల్లికి ఫోన్ చేశాడు. రూ.45 లక్షలు ఇస్తే విడిచి పెడతామంటూ నాలుగురోజుల పాటు హైడ్రామా క్రియేట్ చేశాడు. అయితే, ఎట్టకేలకు పోలీసులు సైబర్ క్రైం పోలీసులు సాయంతో నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్నారు. అనంతరం రిమాండ్ నిమిత్తం వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. జైలులో ఉన్న సాగర్ మంగళవారం ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?