చెట్లు నరికినందుకు ఓ వ్యక్తికి 27 వేలు జరిమానా

హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం అ౦దరికీ తెలిసి౦దే. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను అకారణంగా తొలగించిన వ్యక్తికి మండల తహసీల్దార్ జరిమానా విధించారు. దీంతో పాటు 50 మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ళ‌ కిందట కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామపరిధిలోని హరితవనం కాలనీ లోని ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా […]

  • Publish Date - 9:12 pm, Sat, 2 March 19 Edited By:
చెట్లు నరికినందుకు ఓ వ్యక్తికి 27 వేలు జరిమానా

హరిత తెలంగాణ కోసం ప్రభుత్వం గత నాలుగేళ్ళుగా హరితహారం కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విషయం అ౦దరికీ తెలిసి౦దే. హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను అకారణంగా తొలగించిన వ్యక్తికి మండల తహసీల్దార్ జరిమానా విధించారు. దీంతో పాటు 50 మొక్కలు నాటాలని ఆదేశాలు జారీ చేశారు.

మూడేళ్ళ‌ కిందట కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి మండల కేంద్రంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గ్రామపరిధిలోని హరితవనం కాలనీ లోని ఖాళీ ప్రదేశంలో మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. ఈ క్రమంలో శుక్రవారం దామోదర్‌రావు అనే వ్యక్తి ఆస్థలం నాదంటూ జేసీబీతో చెట్లను తొలగించాడు. ఈ స౦ఘటనతో ఉలిక్కిపడ్డ కాలనీ వాసులు మండల రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు.

తహసీల్దార్ గిరి సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. దామోదర్‌రావు మొత్తం 18 చెట్లను తొలగించినట్లు గుర్తించారు. దీంతో తహసీల్దార్ దామోదర్‌రావుకు రూ. 27 వేలు జరిమానా విధించడంతో పాటు అదనంగా 50 మొక్కలను నాటాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తహసీల్దార్ మాట్లాడుతూ ప్రైవేట్ స్థలాల్లో నాటిన హరితహారం మొక్కలను తొగించాలన్నా ముందుగా తమకు గానీ, గ్రామపంచాయతీ అధికారులకు సమాచారమివ్వాలని సూచించారు. చెట్ల నరికివేతపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు.