నేడు, రేపు ఓటు హక్కు నమోదుకు అవకాశం

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఓటు నమోదుకు మరో అవకాశాన్ని కల్పించింది. ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పిస్తూ నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ నమోదుకు బీఎల్వోలు అందుబాటులో ఉండనున్నారు. ముఖ్యంగా త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదు చేసుకునేందుకు వయస్సు […]

నేడు, రేపు ఓటు హక్కు నమోదుకు అవకాశం
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 8:36 PM

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించాలనే ఉద్దేశ్యంతో ఎన్నికల కమిషన్ ఓటు నమోదుకు మరో అవకాశాన్ని కల్పించింది. ఓటు హక్కు నమోదు, మార్పులు, చేర్పుల కోసం అవకాశం కల్పిస్తూ నేడు, రేపు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ బూత్ స్థాయిలో ఓటర్ నమోదుకు బీఎల్వోలు అందుబాటులో ఉండనున్నారు. ముఖ్యంగా త్వరలో రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని జనవరి 1, 2019 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా నమోదు చేసుకునేందుకు వయస్సు నిర్ధారించే పదో తగరతి మెమో, ఆధార్‌కార్డు, పాస్‌పొర్టు సైజ్ ఫొటో ధ్రువపత్రాలతో బూత్‌లెవల్ అధికారిని కలిసి దరఖాస్తు చేసుకోవచ్చు.

నూతన ఓటు హక్కు నమోదుతో పాటు సవరణకు సైతం అవకాశం కల్పించారు. ఓటరు జాబితాలో చిరునామా, ఇంటిపేరు, తల్లిదండ్రుల పేరు, వయస్సులో మార్పు, ఫోటో మార్పు తదితర తప్పులను సవరణ చేసుకునే అవకాశం ఉంది.

జిల్లాలోని 18 సంవత్సరాల వయస్సు నిండిన దివ్యాంగులందరూ ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకోవడానికి ఈనెల 5వ తేదీ వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించినట్లు జిల్లా మహిళా శిశు సంక్షేమ, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. దివ్యాంగుల ఓటు హక్కు నమోదు కోసం స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి ఓటు హక్కు నమోదుకు అర్హులైన దివ్యాంగులను గుర్తించి ఓటర్ల జాబితాలో చేర్చేందుకు చర్యలు చేపడుతామన్నారు. సదరం సర్టిఫికెట్ ఉన్న వారు, దివ్యాంగులుగా ఉండి సర్టిఫికెట్ ఇంకా పొందని వారు కూడా ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవాలన్నారు.