ఆర్థిక సాయమంటూ అత్యాచారం.. రంగంలోకి పోలీసులు

ఆర్థిక సాయం చేస్తానంటూ అమ్మాయిలను పిలిచి అత్యాచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఓ యువతి తన వద్ద ఉన్న ఆధారాలతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను శనివారం కలిసి ఫిర్యాదు చేసింది.

ఆర్థిక సాయమంటూ అత్యాచారం.. రంగంలోకి పోలీసులు
Follow us

|

Updated on: May 09, 2020 | 6:33 PM

ఆర్థిక సాయం చేస్తానంటూ అమ్మాయిలను పిలిచి అత్యాచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ బంజారాహిల్స్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిపై కేసు నమోదైంది. ఓ యువతి తన వద్ద ఉన్న ఆధారాలతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్‌ను శనివారం కలిసి ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీకి చెందిన మహ్మద్ సలీముద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిరుపేద అమ్మాయిలకు ఆర్థిక సహాయం చేస్తానంటూ ఇంటికి పిలిపించి వారిపై సలీముద్దీన్ అత్యాచారం చేస్తుంటాడని యువతి ఆరోపిస్తోంది. తనకు అలాగే మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడంటూ ఓ 23 సంవత్సరాల ఓ యువతి ఆరోపిస్తోంది. తన వద్ద వున్న పూర్తి ఆధారాలతో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కలిసిన యువతి సదరు వ్యక్తిపై చర్య తీసుకోవాలని కోరింది.

యువతి ఇచ్చిన ఫిర్యాదుపై సలీముద్దీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. 70 సంవత్సరాల సలీముద్దీన్‌కు నలుగురు భార్యలున్నారని, వారంతా విదేశాల్లో ఉంటారని సమాచారం. సలీముద్దీన్ కూడా విదేశాల్లో ఉండి అమ్మాయిల కోసమే తరచూ హైదరాబాద్ వస్తూ ఉంటాడని చెబుతున్నారు. ఆర్థిక సాయం పేరిట అమ్మాయిలకు సలీముద్దీన్ వల వేస్తాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజానిజాలను పోలీసుల కూపీ లాగుతున్నారు.