రాపాక, రవితేజ… తర్వాత నాదెండ్లేనా?

ఒకవైపు వరుస కార్యక్రమాలతో జనసేనాని పవన్ కల్యాణ్ దూసుకుపోతుంటే.. మరోపక్క పార్టీ నుంచి జనసైనికులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నారు. కొందరు నేరుగా పార్టీకి దూరమైతే మరికొందరు పరోక్షంగా పార్టీకి దూరమైపోతున్నారు. వరుస కార్యక్రమాలు చేపడితే పార్టీ వర్గాల్లో ఉత్సాహం నిండుతుందనుకున్న పవన్ కల్యాణ్ తాజా నిష్క్రమణలతో ఆలోచనలో పడిపోయారని జనసైనికులు చెప్పుకుంటున్నారు. ఈ నిష్క్రమణల పరంపర ఇలాగే కొనసాగి.. త్వరలో పవన్ కల్యాణ్‌కు కుడిభుజంలా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమయ్యేలా వున్నారని పార్టీ […]

రాపాక, రవితేజ... తర్వాత నాదెండ్లేనా?
Follow us
Rajesh Sharma

|

Updated on: Dec 14, 2019 | 4:02 PM

ఒకవైపు వరుస కార్యక్రమాలతో జనసేనాని పవన్ కల్యాణ్ దూసుకుపోతుంటే.. మరోపక్క పార్టీ నుంచి జనసైనికులు ఒక్కరొక్కరే తప్పుకుంటున్నారు. కొందరు నేరుగా పార్టీకి దూరమైతే మరికొందరు పరోక్షంగా పార్టీకి దూరమైపోతున్నారు. వరుస కార్యక్రమాలు చేపడితే పార్టీ వర్గాల్లో ఉత్సాహం నిండుతుందనుకున్న పవన్ కల్యాణ్ తాజా నిష్క్రమణలతో ఆలోచనలో పడిపోయారని జనసైనికులు చెప్పుకుంటున్నారు. ఈ నిష్క్రమణల పరంపర ఇలాగే కొనసాగి.. త్వరలో పవన్ కల్యాణ్‌కు కుడిభుజంలా వ్యవహరిస్తున్న మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ కూడా పార్టీకి దూరమయ్యేలా వున్నారని పార్టీ వర్గాలు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ జనసేన పార్టీకి ఏమైంది? ఆరు రోజుల రాయలసీమ పర్యటన, నాలుగు రోజుల పాటు గోదావరి జిల్లాల పర్యటన.. ఆ తర్వాత కాకినాడలో ఒక రోజు దీక్ష.. ఇలా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంలో పోరాట పటిమను ప్రదర్శిస్తున్న పవన్ కల్యాణ్.. పార్టీలోకి కొత్త వర్గాలు వచ్చి చేరుతాయని, పార్టీ మరింత బలోపేతం అవుతుందని అనుకుంటుంటే.. పరిస్థితి అందుకు భిన్నంగా మారుతోంది.

రాయలసీమ పర్యటనలో పవన్ కల్యాణ్ ఇంగ్లీష్ మీడియంకు వ్యతిరేకంగా గళమెత్తితే.. ఆయన పార్టీకి వున్న ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అసెంబ్లీలో ఇంగ్లీష్ మీడియంకు మద్దతు పలికారు. ఆ తర్వాత కాకినాడలో పవన్ కల్యాణ్ రైతు సమస్యలపై ఒక రోజు నిరాహార దీక్ష చేస్తే.. ఆ మర్నాడే పవన్ కల్యాణ్‌కు సన్నిహితునిగా పేరున్న రాజు రవితేజ పార్టీని వీడారు.

అయితే, పార్టీకి మరో పెద్ద ఝలక్ త్వరలోనే తగులుతుందని పలువురు చెప్పుకుంటున్నారు. పవన్ కల్యాణ్‌కు అన్నీ తానై వ్యవహరిస్తుంటే.. చివరి నిమిషంలో పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబుకు తన పక్కన సీటిస్తూ పెద్ద పీట వేస్తున్నారని నాదెండ్ల మనోహర్ గుర్రుగా వున్నట్లు సమాచారం. అదే సమయంలో మోదీని పొగుడుతూ.. బిజెపికి దగ్గరవుతున్న సిగ్నల్స్ ఇస్తున్న పవన్ కల్యాణ్ తీరు కూడా నాదెండ్లకు నచ్చడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ రెండు కారణాలతో కాస్త సైలెంటైన నాదెండ్ల మనోహర్.. పవన్ కల్యాణ్ మరోసారి బిజెపికి దగ్గరైన సంకేతాలిస్తే.. ఆ వెంటనే తన నిర్ణయం తాను తీసుకుంటానని తన సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

ఏది ఏమైనా.. ఒక దశలో టిడిపి బలహీన పడి.. ఏపీలో వైసీపీకి ధీటైన ప్రత్యర్థిగా ఎదుగుతుందనుకున్న జనసేన పార్టీ ఇలా సిల్లీ కారణాలతో వీక్ అవడం రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.