హుజూరాబాద్‌లో విషాదం…అమ్మ పాలే బిడ్డ ఉసురు తీశాయి
చిన్నపిల్లలు ఏడుస్తున్నారు కదా అని వారికి పాలు పట్టించి అలా వదిలెయ్యకండి. ఆకలిని మాత్రమే కాదు వారు ఏ బాధ అయినా ఏడుపుతోనే వెల్లిబుచ్చుతారు. కొన్నిసార్లు అమ్మపాలు కూడా పిల్లల ఉసురు తియ్యెచ్చు. ఇప్పుడు అటువంటి సంఘటనే హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. నగరంలోని పోశమ్మవాడలో నివశించే గోస్కుల రాకేశ్, భవానికి పోయిన ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితమే వీరికి పండంటి బాబు పుట్టాడు. ఎంతో ముద్దుగా చూసుకునే తమ బాబుకి హర్ష అని పేరు పెట్టుకున్నారు. […]
చిన్నపిల్లలు ఏడుస్తున్నారు కదా అని వారికి పాలు పట్టించి అలా వదిలెయ్యకండి. ఆకలిని మాత్రమే కాదు వారు ఏ బాధ అయినా ఏడుపుతోనే వెల్లిబుచ్చుతారు. కొన్నిసార్లు అమ్మపాలు కూడా పిల్లల ఉసురు తియ్యెచ్చు. ఇప్పుడు అటువంటి సంఘటనే హుజూరాబాద్‌లో చోటుచేసుకుంది. నగరంలోని పోశమ్మవాడలో నివశించే గోస్కుల రాకేశ్, భవానికి పోయిన ఏడాదిన్నర క్రితం వివాహమైంది. నాలుగు నెలల క్రితమే వీరికి పండంటి బాబు పుట్టాడు. ఎంతో ముద్దుగా చూసుకునే తమ బాబుకి హర్ష అని పేరు పెట్టుకున్నారు. కాగా రాకేశ్ సెంట్రింగ్ పనికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తూ ఉండగా, భవాని ఇంట్లో ఉంటూ తన ముద్దుల బిడ్డను చూసుకుంటుంది.
అయితే గురువారం రాత్రి సమయంలో పిల్లాడికి చనుబాలు పట్టించిన అనంతరం భవాని నిద్రించింది. ఆ తర్వాత బాబు కొంతసేపటికే ఉక్కిరిబిక్కిరి అయ్యి మొదటడం ప్రారంభించాడు. పాలు ఎక్కువగా తాగడంతో అవి ముక్కులోంచి బయటకు వచ్చాయి. కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే గవర్నమెంట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే బాబు మృతి చెందాడని వైద్యుల నిర్ధారించారు. దీంతో బాబు పేరెంట్స్ రోదనలు ఆపడం ఎవరి తరం కాలేదు.