పెళ్లి మండపంపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్.. 14 మంది దుర్మరణం

రాజస్థాన్‌లోని బార్మేర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో టెంట్ మీద కరెంటు తీగ తెగిపడడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. బార్మేర్‌లో ఓ పెళ్లి వేడుక సందర్భంగా అతిథుల కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే, భారీ వర్షం రావడంతో అందరూ ఆ టెంట్‌ల కిందకు చేరారు. అదే సమయంలో భారీ ఎత్తున ఈదురుగాలులు వీచి టెంట్లు కూలాయి. మరోవైపు విద్యుత్ తీగ తెగిపడి […]

పెళ్లి మండపంపై తెగిపడ్డ హైటెన్షన్ వైర్.. 14 మంది దుర్మరణం
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 23, 2019 | 7:45 PM

రాజస్థాన్‌లోని బార్మేర్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ పెళ్లి వేడుకలో టెంట్ మీద కరెంటు తీగ తెగిపడడంతో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. బార్మేర్‌లో ఓ పెళ్లి వేడుక సందర్భంగా అతిథుల కోసం టెంట్లు ఏర్పాటు చేశారు. అయితే, భారీ వర్షం రావడంతో అందరూ ఆ టెంట్‌ల కిందకు చేరారు. అదే సమయంలో భారీ ఎత్తున ఈదురుగాలులు వీచి టెంట్లు కూలాయి. మరోవైపు విద్యుత్ తీగ తెగిపడి ఆ తడి టెంట్ మీద పడడంతో విద్యుత్ షాక్ కొట్టి.. వారంతా చనిపోయినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డవారందనీ అందరినీ వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పెళ్లి సందర్భంగా ఏర్పాటు చేసిన ‘రామ కథ’ వింటుండగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

కాగా ఈ ఘటనపై ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు తెలిపారు.