AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ కవ్వింపు చర్యలు.. షెల్స్ ప్రయోగించడంతో ముగ్గురు పౌరులు మృతి

ఓ వైపు అభినందన్‌ విడుదలతో భారత్‌ పాక్‌ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్‌ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్‌ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు […]

పాక్ కవ్వింపు చర్యలు.. షెల్స్ ప్రయోగించడంతో ముగ్గురు పౌరులు మృతి
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Mar 02, 2019 | 12:12 PM

Share

ఓ వైపు అభినందన్‌ విడుదలతో భారత్‌ పాక్‌ మధ్య శాంతి చర్చల ప్రక్రియ మొదలవుందని అందరూ భావిస్తుండగా.. పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టింది. జమ్మూకశ్మీర్‌ సరిహద్దుల్లో పాక్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పదేపదే ఉల్లంఘిస్తోంది. పూంచ్‌, రాజౌరీ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న భారత సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా భారీ తుపాకులు, 105 ఎంఎం హోవిట్జర్లతో విరుచుకుపడుతోంది. మోర్టార్‌ షెల్స్‌తో దాడికి తెగబడింది. పాక్‌ రేంజర్ల దాడులను భారత భద్రతా దళాలు ధీటుగా తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్పీఎఫ్‌ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కొల్పోయారు. ఒక పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు.

షెల్స్ దాడికి కుప్పకూలిన ఇళ్లు..

పూంచ్‌ జిల్లాలో పాక్‌ రేంజర్ల దాడిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పాక్‌ రేంజర్ల దాడిలో రుబానా కోసర్‌ (24), ఆమె కుమారుడు ఫజాన్‌ (5)తో పాటు తొమ్మిది నెలల కుమార్తె ఫబ్నమ్‌ చనిపోయినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో రుబానా భర్త యూనిస్‌ గాయలతో బయటపడ్డాడని వెల్లడించారు. అంతకు ముందు పాక్‌ కాల్పుల్లో నసీమ్‌ అనే పౌరుడు తీవ్రంగా గాయపడ్డాడని తెలిపారు. గత వారం రోజుల్లో పాక్‌ 60 సార్లు కాల్పువ ఉల్లంఘనకు పాల్పడిందన్నారు. ఈ నేపథ్యంలో రాజౌరీ, పూంచ్‌ జిల్లాల్లో ఎల్వోసీకి 5 కిలోమీటరల​ పరిధిలో ఉన్న విద్యాసంస్థలన్నింటినీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. గతేడాది పాక్‌ 2,936 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది. భయాందోళనలతో సరిహద్దు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు సమాచారం.ఉగ్రవాదుల స్థావరాన్ని భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Follow Us
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్‌లో సత్తా చాటిన తెలుగు తేజం
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురి.. మూవీ టైటిల్ మామూలుగా..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఒకే ఒక్కడు.. ఐపీఎల్‌ చరిత్రలో కోహ్లీ సరికొత్త రికార్డు..
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
ఈ కొరత కృత్రిమమా? లేక, పాపమంతా హర్మూజ్‌దేనా?
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
1989 సంవత్సరం టాలీవుడ్‌కు ఓ సువర్ణాధ్యాయం..
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో అంగన్వాడీ కేంద్రాల్లో 5 వేల ఉద్యోగాలు.. త్వరలో నోటిఫికేషన్
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
మెరుపు మూవీ స్టార్ట్ అయిన 15 రోజులకే ఎందుకు ఆగిపోయిందో తెల్సా
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
ఉల్లిపాయలు ఎన్ని నెలలైన ఫ్రెష్‌గా ఉండాలా.. ఈ 5 సింపుల్ ట్రిక్స్..
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
తీవ్ర విషాదం.. చూస్తుండగానే ముగినిపోయిన 11 ఏళ్ల బాలుడు.. వీడియో
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..
డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్‌గా ఆధార్ పనికిరాదా..? కేంద్రం ప్రకటన..