కరోనా ఎఫెక్ట్..”పీవోకే”లో పాక్‌ అధికారుల తీరు చూస్తే షాక్..!

కరోనాతో ప్రపంచమంతా ఎంతలా వణికిపోతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి 54వేల మందికి పైగా ప్రాణాలు తీసింది. మరో పది లక్షల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. మన దేశంలో కూడా గత వారం రోజులుగా కేసుల నమోదు పెరుగుతోంది. అయితే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక మన పొరుగు దేశం పాక్‌లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అక్కడ కూడా గత వారం నుంచి పాజిటివ్ కేసుల […]

  • Updated On - 8:04 pm, Sat, 4 April 20 Edited By: Pardhasaradhi Peri
కరోనా ఎఫెక్ట్.."పీవోకే"లో పాక్‌ అధికారుల తీరు చూస్తే షాక్..!

కరోనాతో ప్రపంచమంతా ఎంతలా వణికిపోతుందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ మహమ్మారి 54వేల మందికి పైగా ప్రాణాలు తీసింది. మరో పది లక్షల మందికిపైగా ఆస్పత్రి పాలయ్యారు. మన దేశంలో కూడా గత వారం రోజులుగా కేసుల నమోదు పెరుగుతోంది. అయితే ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఇక మన పొరుగు దేశం పాక్‌లో పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. అక్కడ కూడా గత వారం నుంచి పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరిగపోతోంది. ఈ క్రమంలో ప్రజలను కాపాడుకోవాల్సిన ప్రభుత్వం.. అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో పరిస్థితి దయనీయంగా ఉన్నట్లు తెలుస్తోంది. అక్కడి ప్రజలకు అందించే నిత్యవసర సరుకులను అధికారులు అందనీయకుండా చేస్తున్నారు. ప్రజలకు ఇవ్వాల్సిన వాటిని.. అక్కడి అధికారులే అడ్డదారిలో రిటైల్ షాపులకు చేరవేస్తున్నారట. ఇదేంటని ప్రశ్నిస్తే.. వెళ్లి అక్కడ కొనుక్కోవాలంటూ బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారట. ఈ అధికారుల తీరు చూసి అక్కడి ప్రజలు విస్తుపోతున్నారు.