#COVID19 మాస్కు ఇక మస్ట్.. కేంద్రం తాజా ఆదేశం

మాస్కు ధారణ విషయంలో ఇన్నాళ్ళు వున్న భిన్నాభిప్రాయాలకు కేంద్రం చెక్ పెట్టింది.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కు వేసుకోవాలా వద్దా అనే విషయంలో ఇప్పటి వరకు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి అంటూ వుంటే.. మరికొందరు భిన్నంగా వాదిస్తున్నారు.

#COVID19 మాస్కు ఇక మస్ట్.. కేంద్రం తాజా ఆదేశం
Follow us

|

Updated on: Apr 04, 2020 | 5:18 PM

మాస్కు ధారణ విషయంలో ఇన్నాళ్ళు వున్న భిన్నాభిప్రాయాలకు కేంద్రం చెక్ పెట్టింది.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు మాస్కు వేసుకోవాలా వద్దా అనే విషయంలో ఇప్పటి వరకు రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కొందరు మాస్కులు కట్టుకోవడం తప్పనిసరి అంటూ వుంటే.. మరికొందరు మాస్కులు ప్రతీ ఒక్కరికి అవసరం లేదని చెబుతున్నారు. కమాస్కులు కేవలం కరోనా వైరస్ పాజిటివ్ వున్న వారికి చికిత్సను అందిస్తున్న వారు మాత్రం మాస్కు కట్టుకుంటే చాలని చెప్పిన డాక్టర్లు కూడా వున్నారు.

తాజాగా కేంద్రం చాలా క్లియర్‌గా ప్రకటించింది ఇల్లు దాటి బయటికి వెళ్ళే ప్రతీ ఒక్కరు మాస్కు కట్టుకుని తీరాలని ఆదేశాలు జారీ చేసింది. లాక్ డౌన్ పీరియడ్ ముగిసిన తర్వాత కొన్నాళ్ళ పాటు మాస్కులు లేకుండా ఇల్లు వదలి రావద్దని తెలియజేసింది. లాక్ డౌన్ ముగియడానికి ఇంకా 11 రోజులు మిగిలి వున్న నేపథ్యంలో తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాలు దేశవ్యాప్తంగా ఒక క్లారిటీ తెచ్చినట్లయ్యింది.

ముఖ్యంగా లాక్ డౌన్ రోజుల సంగతి పక్కన పెడితే.. దాన్ని ఎత్తివేసిన వెంటనే పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డెక్కే అవకాశం వున్నప్పుడు ఆ తర్వాత కొంత కాలం మాస్కులు లేకుండా బయటికి రావద్దని కేంద్రం చెబుతోంది. ఇదే సమయంలో మాస్కు అవసరాన్ని తెలిపేందుకు ప్రత్యేక కారణాలను వెల్లడిస్తోంది కేంద్రం. గతంలో ఫ్లూ వంటి వ్యాధులు ప్రబలినపుడు చాలా రోజుల వరకు మాస్కుల వాడకం కొనసాగింది. అదేతరహాలో మాస్కులు లేకుండా కొన్నాళ్ళ పాటు బయటికి రావద్దని మాత్రం చెబుతోంది కేంద్రం. సోషల్ డిస్టెన్సింగ్ మెయింటేన్ చేస్తూనే మాస్కు కూడా వేసుకుంటే 90 శాతం కరోనా వ్యాప్తిని నివారించవచ్చని డాక్టర్లు చెబుతున్నారు.

అయితే, గాలి ద్వారా కరోనా వ్యాపించదు కాబట్టి మాస్కులు అవసరం లేదన్న వాదనలను కేంద్రం తోసిపుచ్చింది. కొంత కాలం పాటు మాస్కు ధరించడం తప్పనిసరి అన్న సంకేతాల్నిస్తూనే అందుకు ప్రజలను సన్నద్దం చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది కేంద్ర ప్రభుత్వం.

Latest Articles
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
అతి తక్కువ ధరకే 1GBPS వేగంతో ఇంటర్నెట్.. బీఎస్ఎన్ఎల్ నుంచి..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
ఈ టిప్స్ పాటించారంటే.. మీ థై ఫ్యాట్ తగ్గి సన్నగా కనిపిస్తారు..
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మెల్ బాయ్స్.. ఎక్కడ చూడొచ్చంటే?
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ఈ సమస్య ఉన్న చిన్నారుల్లో.. గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువ
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
ప్రభాస్ ప్రపోజ్ చేస్తే రిజక్ట్ చేసిందట..! అన్నకే తప్పలేదు మనమెంత
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
'కేసీఆర్ కంటే ధార్మికుడు మరొకరున్నారా?'.. మాజీమంత్రి హరీష్‌ రావు
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
ప్రభుత్వ ఆస్పత్రిలో ఇదేం పని.. సీసీ టీవీకి చిక్కాడు..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
కిర్రాక్ లుక్.. క్రేజీ ఫీచర్స్.. కొత్త ఈ-బైక్ మామూలుగా లేదుగా..
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
టీ20 ప్రపంచకప్‌లో ఏకంగా 8 మంది ఆర్సీబీ ప్లేయర్లు.. ఫుల్ లిస్ట్
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..
రూ. 10 వేలతో ఈ మిషన్‌ కొంటే.. వేలల్లో సంపాదించొచ్చు..