AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lock-down ends: లాక్‌డౌన్ ముగిసే తేదీ చెప్పేసిన మోదీ.. అందుకే ఆ స్టెప్స్!

21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14 రాత్రితో ముగుస్తుందా లేక ఆ తర్వాత కూడా కొనసాగుతుందా అన్న సందేహానికి చూచాయగా క్లారిటీ ఇచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మూడు రోజుల క్రితం వరకు అంతా క్రమశిక్షణతో వున్నందున లాక్ డౌన్ గడువు ప్రకారమే ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ...

Lock-down ends: లాక్‌డౌన్ ముగిసే తేదీ చెప్పేసిన మోదీ.. అందుకే ఆ స్టెప్స్!
Rajesh Sharma
|

Updated on: Apr 02, 2020 | 4:42 PM

Share

Modi has given hint about lock-down end date: 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 14 రాత్రితో ముగుస్తుందా లేక ఆ తర్వాత కూడా కొనసాగుతుందా అన్న సందేహానికి చూచాయగా క్లారిటీ ఇచ్చారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. మూడు రోజుల క్రితం వరకు అంతా క్రమశిక్షణతో వున్నందున లాక్ డౌన్ గడువు ప్రకారమే ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తబ్లిఘీ జమాత్ ఉదంతం బయటపడిన తర్వాత లాక్ డౌన్ నిరవధికంగా కొనసాగుతుందన్న అభిప్రాయానికి చాలా మంది వచ్చేశారు.

కానీ గురువారం ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లాక్ డౌన్‌ను పొడిగించే ఉద్దేశం లేదన్న సంకేతాలను ఇచ్చేశారు. దాంతో ఏప్రిల్ 15తో లాక్‌డౌన్ ముగించే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటిలోగా కరోనా వ్యాప్తిని అరికట్టగలమన్న నమ్మకంతో కఠిన చర్యలు కొనసాగించాలని మోదీ ముఖ్యమంత్రులకు సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో ఈమేరకు ప్రధాని సంకేతాలిచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈలోపు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని సూచన చేశారని సమాచారం. తబ్లీఘీ-జమాత్ సభ్యులందరినీ గుర్తించి క్వారంటైన్ చేయాలని ప్రధాని ముఖ్యమంత్రులకు చెప్పారు.

మరోవైపు ఏప్రిల్ పదిహేనో తేదీ నుంచి టిక్కట్ల బుకింగ్‌ను రైల్వేలు, విమానయాన సంస్థలు, ట్రావెల్ బుకింగ్ సంస్థలు ప్రారంభించేశాయి. ఇది కూడా లాక్ డౌన్ పొడిగించే యోచనలో కేంద్రం లేదు అనడానికి నిదర్శనంగా నిలుస్తున్నాయని చెబుతున్నారు. ఏదైనా అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటూ తప్పించి.. ఏప్రిల్ 14 రాత్రికే లాక్ డౌన్ ముగిసే పరిస్జితి ప్రస్తుతానికి కనిపిస్తోంది.