‘అప్పుడు నేను బాలుడ్ని.. నాకు శిక్ష తగ్గించండి ‘.. నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా

నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కూడా సుప్రీంకోర్టుకెక్కాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ నన్న   తన వాదనను గత ఏడాది కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇఛ్చిన ఉత్తర్వులను ఇతగాడు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశాడు. ఈ కేసులో తాజాగా దోషులకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో.. పవన్ గుప్తా.. తాను అప్పట్లో జువెనైల్ గనుక ఆ చట్ట నిబంధనలననుసరించి తనకు తక్కువ శిక్ష విధించాలని కోరాడు. గతంలో తనకు సరిగా వైద్య పరీక్షలు […]

'అప్పుడు నేను బాలుడ్ని.. నాకు శిక్ష తగ్గించండి '.. నిర్భయ కేసు దోషి పవన్ గుప్తా
Follow us

| Edited By:

Updated on: Oct 18, 2020 | 9:35 PM

నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన పవన్ గుప్తా కూడా సుప్రీంకోర్టుకెక్కాడు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ నన్న   తన వాదనను గత ఏడాది కొట్టివేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇఛ్చిన ఉత్తర్వులను ఇతగాడు అత్యున్నత న్యాయస్థానంలో సవాలు చేశాడు. ఈ కేసులో తాజాగా దోషులకు డెత్ వారెంట్ జారీ అయిన నేపథ్యంలో.. పవన్ గుప్తా.. తాను అప్పట్లో జువెనైల్ గనుక ఆ చట్ట నిబంధనలననుసరించి తనకు తక్కువ శిక్ష విధించాలని కోరాడు. గతంలో తనకు సరిగా వైద్య పరీక్షలు నిర్వహించలేదన్నాడు. ఇదిలాఉండగా.. ఈ కేసులో ముకేష్ సింగ్ మెర్సీ పిటిషన్ ని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తిరస్కరించిన అనంతరం.. ఈ దోషులను ఫిబ్రవరి 1 వ తేదీ ఉదయం 6 గంటలకు ఉరి తీయాలని  తాజా డెత్ వారెంట్లు జారీ అయ్యాయి. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన అనంతరం.. దోషుల ఉరితీతకు, ఈ పిటిషన్ తిరస్కరించినప్పటి నుంచి 14 రోజుల వ్యవధి ఉండాలని చట్ట నిబంధనలున్నాయి.

ఉరి తేదీని ఇక వాయిదా వేయకండి.. నిర్భయ తల్లి ఆశాదేవి:

నిర్భయ కేసు దోషుల ఉరితీతను మళ్ళీ వాయిదా వేయరాదని నిర్భయ తల్లి ఆశాదేవి కోరారు. ఈ నెల 22 న వారిని ఉరి తీయవలసి ఉందని, అయితే మళ్ళీ ఫిబ్రవరి 1 కి వాయిదా వేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం కోసం ఇన్నేళ్ళుగా తాను కోర్టుల చుట్టూ తిరుగుతున్నానని ఆమె వాపోయారు. తీహార్ జైలు అధికారులతో బాటు ఢిల్లీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నేనెందుకు వ్యధ చెందాలి అని ఆమె ప్రశ్నించారు. దోషులను క్షమించాలని, వారి ఉరితీతను ఆపాలని సీనియర్  న్యాయవాది ఇందిరా జైసింగ్ చేసిన వ్యాఖ్యలను ఆశాదేవి తప్పు పట్టారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె ఇలా ఏవిధంగా మాట్లాడతారని అన్నారు. తాను ఎన్నోసార్లు ఇన్ని సంవత్సరాలుగా సుప్రీంకోర్టులో ఆమెను కలుస్తూ వచ్చానని, కానీ ఒక్కసారికూడా ఆమె తన బాగోగుల గురించి పట్టించుకోలేదని విమర్శించిన ఆశాదేవి..  ఇప్పుడు ఒక్కసారిగా దోషుల తరఫున ఆమె మాట్లాడడం ఏమిటని అన్నారు. ఇలాంటివారు రేపిస్టులను సమర్థిస్తుంటే ఇక అత్యాచారాలు ఎలా ఆగుతాయన్నారు.కాగా-మాజీ ప్రధాని దివంగత రాజీవ్ గాంధీ హంతకురాలు నళినీ మురుగన్ కు క్షమాభిక్ష పెట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ మాదిరే మీరు కూడా ఈ నిర్భయ దోషులను క్షమించాలని ఇందిరా జైసింగ్.. ఆశాదేవిని కోరినట్టు వార్తలు వచ్చాయి.