బ్రేకింగ్: లండన్‌లో నీరవ్ మోదీ అరెస్ట్
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో బ్యాంకులకు వేల కోట్లలో రుణాలు ఎగ్గొట్టిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయనను లండన్ కోర్టులో హాజరుపరచనున్నారు. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బలపరుస్తూ.. బుధవారం లండన్‌లో నీరవ్ మోదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు నీరవ్ వేల […]
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని పోలీసులు అరెస్ట్ చేశారు. భారత్‌లో బ్యాంకులకు వేల కోట్లలో రుణాలు ఎగ్గొట్టిన కేసులో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆయనను లండన్ కోర్టులో హాజరుపరచనున్నారు. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన రెండు రోజులకే ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ విషయాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు బలపరుస్తూ.. బుధవారం లండన్‌లో నీరవ్ మోదీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. అయితే పంజాబ్ నేషనల్ బ్యాంక్ సహా పలు బ్యాంకులకు నీరవ్ వేల కోట్లలో రుణాలు ఎగ్గొట్టాడు. ఈ క్రమంలో గత ఏడాది లండన్‌కు వెళ్లి తలదాచుకున్న నీరవ్ మోదీ అక్కడ కూడా వజ్రాల వ్యాపారం చేస్తున్నారు.