AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో వెలుగు చూసిన కొత్త రకం సైబర్ మోసం.. నమ్మినందుకు నట్టేట ముంచాడు.. కూపీలాగుతున్న పోలీసులు

దేశవ్యాప్తంగా సైబర్‌ కేటుగాళ్లు పెరిగిపోయారు. అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు లింకులు, కఇప్పటి వరకు మోసాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు.

ఏపీలో వెలుగు చూసిన కొత్త రకం సైబర్ మోసం.. నమ్మినందుకు నట్టేట ముంచాడు.. కూపీలాగుతున్న పోలీసులు
Balaraju Goud
|

Updated on: Mar 23, 2021 | 3:00 PM

Share

AP cyber crime : దేశవ్యాప్తంగా సైబర్‌ కేటుగాళ్లు పెరిగిపోయారు. అందినకాడికి అడ్డంగా దోచేస్తున్నారు. క్రెడిట్ కార్డులు, ఆధార్ కార్డు లింకులు, కఇప్పటి వరకు మోసాలకు పాల్పడుతున్న కేటుగాళ్లు.. కొత్త తరహా దోపిడీలకు తెరతీస్తున్నారు. ఇందుకు తాజాగా జరిగిన ఈ మోసమే తార్కాణం.

పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 20న ఏపీలోని కృష్ణా జిల్లా గన్నవరం పట్టణంలోని ఓ వాలంటీర్‌కు.. అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్‌ కాల్‌ వచ్చింది. తొలుత తన పరిధిలో ఉన్న గృహాలు ఎన్ని.. అందరికీ ప్రభుత్వ పథకాలు సక్రమంగా అందుతున్నాయా? అని ఆ వాలంటీర్‌ని సదరు వ్యక్తి అడగడంతో.. ఓ విద్యార్థికి అమ్మఒడి నగదు జమ కాలేదని చెప్పాడు. దీంతో స్పందించిన అవతలి వ్యక్తి.. విద్యార్థి తండ్రి ఫోన్‌ నెంబర్‌ చెప్పు.. కాన్ఫరెన్స్‌ పెట్టి సమస్య తెలుసుకుంటానన్నాడు. విద్యార్థి తండ్రి ఫోన్‌ నంబర్‌ను వాలంటీర్‌ అతడికి చెప్పడంతో కాన్ఫరెన్స్‌ పెట్టిన కేటుగాడు.. వాలంటీర్‌ కాల్‌ కట్‌ చేసి విద్యార్థి తండ్రిని అమ్మఒడి నగదు పడతాయంటూ మాయమాటలతో ఆకట్టుకొని తొలుత రూ.4వేలు, అనంతరం రూ.9 వేలు వెరసి రూ.13 వేలను తన బ్యాంకు ఖాతాలో జమయ్యేట్లు ఫోన్‌పే చేయించుకొని ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేశాడు.

కాగా, మోసపోయామని గ్రహించిన బాధితుడు.. వాలంటీర్‌ ద్వారా గన్నవరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ కేసును విజయవాడ సైబర్‌ క్రైమ్‌కు బదిలీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు సైబర్‌క్రైమ్‌ పోలీసులు.. మోసగాడి బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడంపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రజల్లో అవగాహన లోపం వల్లనే ఇటువంటి మోసాలు జరుగుతున్నాయన్న పోలీసులు తెలిపారు. సైబర్‌ నేరగాళ్ల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

Read Also…  Notice To AP Ministers: ఏపీ మంత్రులకు నోటీసులు జారీ చేసిన హైకోర్టు.. లేఖల లీకేజీ వ్యవహారంలో నిమ్మగడ్డ పిటిషన్‌పై..