TDP vs YCP: వైసీపీ, టీడీపీ మధ్య కొత్త పంచాయితీ

Teludu Desam party leaders anger on their security cut down: తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏదో ప్రజాసమస్యలపై అనుకుంటే పొరపడినట్లే. తమకు వ్యక్తిగత భద్రతను తొలగించడంపై టీడీపీ నేతలు జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు భద్రత తగ్గించడం తెలుగు తమ్ముళ్ళలో ఆగ్రహం తెప్పిస్తోంది. భద్రత తొలగింపు వెనుక కుట్ర వుందన్నది టీడీపీ నేతల ఆందోళన. ఈ […]

TDP vs YCP: వైసీపీ, టీడీపీ మధ్య కొత్త పంచాయితీ
Follow us
Rajesh Sharma

|

Updated on: Feb 19, 2020 | 12:12 PM

Teludu Desam party leaders anger on their security cut down: తెలుగుదేశం నేతలు వైసీపీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఏదో ప్రజాసమస్యలపై అనుకుంటే పొరపడినట్లే. తమకు వ్యక్తిగత భద్రతను తొలగించడంపై టీడీపీ నేతలు జగన్ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ సహా పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎంపీలకు భద్రత తగ్గించడం తెలుగు తమ్ముళ్ళలో ఆగ్రహం తెప్పిస్తోంది.

భద్రత తొలగింపు వెనుక కుట్ర వుందన్నది టీడీపీ నేతల ఆందోళన. ఈ అంశాన్ని సాక్షాత్తు మాజీ మంత్రి దేవినేని ఉమ లేవనెత్తారు. తెలుగుదేశం నేతలకు భద్రత తొలగింపు వెనుక ముఖ్యమంత్రి జగన్ కుట్ర వుందన్నది ఆయన ఆరోపణ. జగన్ టీడీపీ నేతలపై కక్షతో రగిలిపోతున్నాడని, చంద్రబాబు, లోకేశ్‌లను జైలుకు పంపాలని జగన్ కోరుకుంటున్నారని ఉమ అంటున్నారు.

20 సంవత్సరాలు ఎమ్మెల్యే గా ఉన్న తనకు భద్రత తొలగించడం ఏంటని, తమని చంపాలని చూస్తున్నారని దేవినేని మండిపడ్డారు. తమను ప్రజలే రక్షించుకుంటారని ఆయనంటున్నారు. మరోవైపు చంద్రబాబుకున్న భద్రతను ఏ మాత్రం తగ్గించలేదని ఏపీ డీజీపీ ప్రకటించారు. చంద్రబాబు భద్రత విషయంలో ఏపీ పాలిటిక్స్‌లో పెద్ద చర్చ జరగుతోంది. ఆయనకు భద్రత తగ్గించారన్న ప్రచారాన్ని ఏపీపోలీసులు తోసిపుచ్చారు. చంద్ర బాబు నాయుడు భద్రతలో ఎలాంటి మార్పులు జరగలేదని ప్రకటించారు. దేశంలోనే అత్యంత హై – సెక్యూరిటీని ఆయనకు కల్పిస్తున్నామని, ప్రస్తుతం Z+ సెక్యూరిటీలో చంద్ర బాబు భద్రత కల్పిస్తున్నామని ప్రకటించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ నిర్ణయం మేరకు భద్రతలో మార్పులు, చేర్పులు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం చంద్రబాబుకు 83 మందితో భద్రత కల్పిస్తున్నామని, విజయవాడలో 135 మంది….హైదరాబాద్‌లో 48 మందితో భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. ఈ భద్రత ప్రజా చైతన్య బస్సు యాత్రలో కూడా కొనసాగుతుందని క్లారిటీ ఇచ్చారు.