ఇండియన్-2 షూటింగ్‌లో తెగిపడ్డ క్రేన్.. అసిస్టెంట్ డైరక్టర్‌తో సహా.. ముగ్గురు మృతి
కమల్ హాసన్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్.. సడన్‌గా పడిపోవడంతో.. ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో.. షూటింగ్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మధు, చంద్రన్ (ఫుడ్ ప్రోవైడర్స్) కాగా.. మరోకరు అసిస్టెంట్ డైరక్టర్ కృష్ణగా […]
కమల్ హాసన్ హీరోగా డైరక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఇండియన్-2 సినిమా షూటింగ్‌లో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని పూనమల్లి దగ్గర షూటింగ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ భారీ క్రేన్.. సడన్‌గా పడిపోవడంతో.. ముగ్గురు మృతి చెందారు. మరో 10 మంది వరకు తీవ్ర గాయాలపాలయ్యారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో.. షూటింగ్‌లో ఉన్న వారంతా షాక్‌కు గురయ్యారు. మృతిచెందిన వారిలో ఇద్దరు మధు, చంద్రన్ (ఫుడ్ ప్రోవైడర్స్) కాగా.. మరోకరు అసిస్టెంట్ డైరక్టర్ కృష్ణగా గుర్తంచారు. పూనమల్లి సమీపంలోని ఈవీపీ పిలిమ్ సిటీలో ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను వెంటనే అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఒకరు మార్గమధ్యలోనే కుప్పకూలినట్లు తెలుస్తోంది. ఇక మరో ఐదుగురికి చికిత్స అందిస్తుండగా.. మిగతా వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం వీరంతా సవిత మెడికల్ కళాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా.. ప్రమాదం జరిగిన సమయంలో షూటింగ్ లోకేషన్‌లోనే దర్శకుడు శంకర్, నటుడు కమల్ హాసన్ ఉన్నారు.