జగన్ సర్కార్‌కు మరో శుభవార్త.. ఈ సారి నాబార్డ్ నుంచి..
జగన్ సర్కార్‌కు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్‌కు రూ.1931/- కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయూత (ఎన్ఐడీఏ) కింద ఈ రుణాన్ని రిలీజ్ చేసినట్లు.. నాబార్డ్ పేర్కొంది. ఈ నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు.. ఏపీ ప్రభుత్వం ఈ నిధులను ఉపయోగించనుంది. ఈ చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ […]
జగన్ సర్కార్‌కు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్ మెంట్ (నాబార్డ్) సంస్థ గుడ్‌న్యూస్ చెప్పింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల అభివృద్ధి కార్పోరేషన్‌కు రూ.1931/- కోట్ల రుణాన్ని మంజూరు చేసింది. మౌలిక సదుపాయాల అభివృద్ధి చేయూత (ఎన్ఐడీఏ) కింద ఈ రుణాన్ని రిలీజ్ చేసినట్లు.. నాబార్డ్ పేర్కొంది. ఈ నిధులతో పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును పూర్తిచేసేందుకు.. ఏపీ ప్రభుత్వం ఈ నిధులను ఉపయోగించనుంది. ఈ చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పూర్తి అయితే.. కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని దాదాపు 33 మండలాల్లోని 410 గ్రామాలకు సాగునీరుతో పాటుగా.. తాగు నీరు కూడా అందనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 53.5 టీఎంసీల నీటిని.. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాలోని పశ్చిమ ప్రాంతాలకు తరలించాలని.. ఏపీ ప్రభుత్వం నిశ్చయించింది. మార్చి 2022 నాటికి ఈ చింతలపూడి ప్రాజెక్టును పూర్తి చేయాలని.. జగన్ సర్కార్ టార్గెట్‌గా పెట్టుకుంది.