“మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్నా..” ప్రజా చైతన్యయాత్రలో లోకేష్..

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ తొమ్మిది నెలల పాలన నవ మోసాల పాలనగా మారిందన్నారు. రైతులకు రూ.12,500/- ఇస్తామని చెప్పి.. ఇప్పుడు దానిని రూ.7,500/- కుదించారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు సెక్యూరిటీ విషయంపై కూడ స్పందించారు. డీజీపీకి అవగాహన లేదనుకుంటానంటూ.. […]

మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్నా.. ప్రజా చైతన్యయాత్రలో లోకేష్..
Follow us

| Edited By:

Updated on: Feb 20, 2020 | 4:19 AM

ఆంధ్రప్రదేశ్‌లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన మీద టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తనదైన శైలిలో ఫైర్ అయ్యారు. టీడీపీ చేపట్టిన ప్రజా చైతన్యయాత్రలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైసీపీ తొమ్మిది నెలల పాలన నవ మోసాల పాలనగా మారిందన్నారు. రైతులకు రూ.12,500/- ఇస్తామని చెప్పి.. ఇప్పుడు దానిని రూ.7,500/- కుదించారని మండిపడ్డారు. ఇక చంద్రబాబు సెక్యూరిటీ విషయంపై కూడ స్పందించారు. డీజీపీకి అవగాహన లేదనుకుంటానంటూ.. చంద్రబాబుకు సెక్యూరిటీ కుదించడం కుట్రపూరిత చర్య అన్నారు. నేను కూడా మావోయిస్టుల హిట్‌ లిస్టులో ఉన్నానని లోకేష్ వ్యాఖ్యానించారు. ఇక సెలక్ట్ కమిటీ రాకుండా మండలి కార్యదర్శిపై ఒత్తిడి తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై తమ పోరాటం ఆగదని లోకేష్ అన్నారు.