చంద్రబాబు సెక్యూరిటీపై క్లారిటీ ఇచ్చిన హోంశాఖ మంత్రి
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించారన్న ఆరోపణలపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. సెక్యూరిటీ తగ్గించారన్న దానిలో నిజం లేదన్నారు. సానుభూతి కోసమే సెక్యూరిటీ తగ్గించారి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతనే కొనసాగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. మొత్తం 153 మందితో భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 45 మంది ఉన్నారని కూడా తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఎవరినీ తగ్గించలేదన్నారు. కానీ చంద్రబాబుకు 53 […]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు భద్రత తగ్గించారన్న ఆరోపణలపై ఏపీ హోం శాఖ మంత్రి సుచరిత స్పందించారు. సెక్యూరిటీ తగ్గించారన్న దానిలో నిజం లేదన్నారు. సానుభూతి కోసమే సెక్యూరిటీ తగ్గించారి రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబుకు జెడ్ ప్లస్ కేటగిరి భద్రతనే కొనసాగిస్తున్నట్టు మంత్రి తెలిపారు. మొత్తం 153 మందితో భద్రత కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో 45 మంది ఉన్నారని కూడా తెలిపారు. సెక్యూరిటీ సిబ్బందిని ఎవరినీ తగ్గించలేదన్నారు. కానీ చంద్రబాబుకు 53 మంది భద్రతా సిబ్బందే ఉన్నారని టీడీపీ ఆరోపిస్తోందన్నారు. అలా ప్రచారం చేయడం సరికాదన్నారు.
మరోవైపు నారా లోకేష్ కూడా చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారంటూ ఆరోపణలు గుప్పించారు. మంగళగిరిలో చేపట్టిన టీడీపీ ప్రజా చైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబుకు సెక్యూరిటీ తగ్గించారంటూ ప్రసంగించారు.