నగరంలో CAAకు అనుకూలంగా బీజేపీ బహిరంగసభ.. ఆ సంకేతం కోసమేనా..?

ఓ వైపు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయేతర రాష్ట్రాలతే.. ఈ చట్టాన్ని వ్యతిరకిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాలకు కౌంటర్‌గా సీఏఏకు మద్దతుగా కూడా ర్యాలీలు.. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే మార్చి 15న హైదరాబాద్ నగరంలో సీఏఏకి మద్దతుగా బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. సభా వేదికగా ఎల్బీ స్టేడియాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ […]

నగరంలో CAAకు అనుకూలంగా బీజేపీ బహిరంగసభ.. ఆ సంకేతం కోసమేనా..?
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Feb 20, 2020 | 5:24 AM

ఓ వైపు దేశ వ్యాప్తంగా అనేక చోట్ల సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్డీయేతర రాష్ట్రాలతే.. ఈ చట్టాన్ని వ్యతిరకిస్తూ.. అసెంబ్లీలో తీర్మానాలు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. విపక్షాలకు కౌంటర్‌గా సీఏఏకు మద్దతుగా కూడా ర్యాలీలు.. బహిరంగ సభలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే మార్చి 15న హైదరాబాద్ నగరంలో సీఏఏకి మద్దతుగా బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనుంది. సభా వేదికగా ఎల్బీ స్టేడియాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ బహిరంగ సభకు.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కూడా పాల్గొనే అవకాశం ఉంది.

ఇదిలా ఉంటే సీఏఏను అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ కూడా.. సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం చేసింది. అలాగే సీఏఏకు వ్యతిరేకంగా వచ్చే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. అసెంబ్లీలో సీఏఏకు వ్యతిరేకంగా తీర్మానం చేయబోతున్నట్లు సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. అలాగే 10లక్షల మందితో భారీ బహిరంగ సభ కూడా ఏర్పాటు చేస్తామని కూడా కేసీఆర్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ నిర్వహించే సభకంటే ముందుగానే.. బీజేపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతోంది. ఈ సభ ద్వారా.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీనే అనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమలనాథులు ప్రయత్నాలు చేస్తున్నారు.