‘గణేశుడి ఎత్తు’ ఇంతే ఉండాలి.. కరోనా ఆంక్షలు

కరోనా నేపథ్యంలో గణేశ్ విగ్రహాల ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది. వినాయక మండపాల్లో ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాల ఎత్తు 4 అడుగులు మించకూడదని...

'గణేశుడి ఎత్తు' ఇంతే ఉండాలి.. కరోనా ఆంక్షలు
Follow us

|

Updated on: Jul 11, 2020 | 7:38 PM

New Guidelines for Ganesh Pandals : కరోనా నేపథ్యంలో గణేశ్ విగ్రహాల ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్ ఆంక్షలు విధించింది. వినాయక మండపాల్లో ఏర్పాటు చేసే వినాయకుడి విగ్రహాల ఎత్తు 4 అడుగులు మించకూడదని ఆదేశించింది. వినాయక చవితి సమీపిస్తున్న నేపథ్యంలో పలు ఆంక్షలను తెరమీదికి తీసుకొచ్చింది. మహారాష్ట్ర హోంశాఖ శనివారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. గణేశ్ మండపాల నిర్వాహకులు విధిగా స్థానిక అధికారుల నుంచి అనుమతి పొందాలని పేర్కొంది. కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన నిబంధనలను మండపాల నిర్వాహకులు తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

మహారాష్ట్రలో ప్రతి ఏటా గణేశ్ ఉత్సవాలను చాలా గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. గణేశ్ మండపాల నిర్వాహకులు పోటాపోటీగా పెద్ద ఎత్తున విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. అయితే ఈ ఏడాది కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో… గణేశ్ విగ్రహాల ఎత్తుపై  అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఇదిలా ఉంటే మహారాష్ట్ర ప్రజలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే గణేశ్ ఉత్సవాలపై ఆంక్షలు విధించడంపై మహారాష్ట్ర ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఇదిలావుంటే.. మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 2.31 లక్షలకు చేరగా వైరస్ బారినపడి ఇప్పటి వరకు 9,667 మంది మరణించారు.