కరోనాపై కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయం
కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ఇకపై దేశవ్యాప్తంగా కరోనా అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా...
New decision of union cabinet on coronavirus: కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా ఇకపై దేశవ్యాప్తంగా కరోనా అవేర్‌నెస్ ప్రోగ్రామ్ చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ 8వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్ ప్రారంభమవుతుందని బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం తర్వాత మంత్రి ప్రకాశ్ జవ్‌దేకర్ వెల్లడించారు.
కరోనా ప్రభావం పూర్తిగా సమసి పోయే దాకా మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, తరచూ చేతులను శుభ్రపరచుకోవడం వంటివే కరోనాపై మన చేస్తున్న యుద్దానికి ఆయుధాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ వాక్సిన్ వచ్చే దాకా ఈ మూడింటిని తప్పకుండా పాటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రచారం నిర్వహించాలని తలపెట్టింది.
లాక్ డౌన్ సడలింపుల కారణంగా దేశంలో పలు చోట్ల కొందరు ఈ మూడు నిబంధనలను పాటించడం లేదన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించిందని, అందుకే మాస్కులను ధరించడం, సామాజిక దూరం పాటించడంతోపాటు తరచూ చేతులను శానిటైజ్ చేసుకోవడం అనివార్యమన్న విషయాన్ని ప్రజలకు విశదపరచాలని నిర్ణయించినట్లు ప్రకాశ్ జవ్‌దేకర్ తెలిపారు.
Also read: ప్రియునితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి
Also read: బీహార్‌లో బీజేపీ మంత్రాంగం.. ఎల్జేపీలోకి కమలనాథులు
Also read: మోదీకి అమిత్ షా అభినందన… ఎందుకంటే?