AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమరావతిపై ‘ఆళ్ళ’ కీలక కామెంట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకవైపు కోర్టులు, ఇంకోవైపు విపక్షాలు అడ్డుతగులుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం...

అమరావతిపై ‘ఆళ్ళ’ కీలక కామెంట్
Rajesh Sharma
|

Updated on: Oct 07, 2020 | 6:09 PM

Share

Crucial comments by Alla on Andhra capital: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఒకవైపు కోర్టులు, ఇంకోవైపు విపక్షాలు అడ్డుతగులుతున్నా.. వైసీపీ నేతలు మాత్రం 3 రాజధానులను ఎవరు ఆపలేరంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి శాసన రాజధానిగా మాత్రమే మిగిలిపోతుందని ఘంటాపథంగా చెబుతున్నారు. తాజాగా మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామక‌ృష్ణారెడ్డి మూడు రాజధానుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించినప్పటికీ ఇంకా ఆందోళన చేయటం అర్థరహితం.. అమరావతి రాజధాని విషయంలో ఏ ఒకరికి అన్యాయం జరగదు… చంద్రబాబు నాయుడు తన అవినీతి కోసమే శివరామన్ కమిటీ ఈ ప్రాంతం రాజధానికి పనికిరాదు అని చెప్పినప్పటికీ బలవంతంగా అమరావతిని రాజధానిగా ప్రకటించారు.. అమరావతి చరిత్ర అయిపోయింది.. శాసన రాజధానిగా అమరావతి మిగిలిపోతుంది .. ’’ అని అన్నారు ఆళ్ళ రామక‌ృష్ణారెడ్డి.

రాజధాని ప్రాంతంలో పేదవారికి ఇళ్ళు ఇస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే ప్రతిపక్షాలు కోర్టులో కేసు వేశాయని ఆరోపించారు. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ళు లభించకుండా అడ్డుతగలడం అన్యాయమని ఆళ్ళ వ్యాఖ్యానించారు. ఎవరెన్ని విధాలుగా అడ్డుకోవాలని చూసినా.. చివరికి కోర్టుల్లో న్యాయమే గెలుస్తుందని అన్నారు. పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని ఆళ్ళ చెబుతున్నారు.

Also read:  కరోనాపై కేంద్ర కేబినెట్ కొత్త నిర్ణయం

Also read: ప్రియునితో కలిసి కన్నకొడుకును చంపిన తల్లి

Also read:  బీహార్‌లో బీజేపీ మంత్రాంగం.. ఎల్జేపీలోకి కమలనాథులు

Also read: మోదీకి అమిత్ షా అభినందన… ఎందుకంటే?