మరోసారి మోదీ ప్రభంజనమే అంటున్న ఎగ్జిట్ పోల్స్

యావత్​ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు వచ్చేశాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ మరోసారి ఎన్డీఏకి పట్టం కట్టాయి. ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌​ సహా ఇతర పార్టీల కంటే బీజేపీ మిత్రపక్షాలు దాదాపు 300 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి. దీంతో కేంద్రంలో మరోసారి కమలం వికసించినట్లేనని తెలుస్తోంది. మోదీ ప్రభంజనం ముందు విపక్షాలు ఓడిపోయినట్లేనని సర్వేలు తెలుపుతున్నాయి. ఎన్డీఏ కూటమి సంపూర్ణ అధిక్యంతో మరోసారి పగ్గాలు చేపట్టడం […]

మరోసారి మోదీ ప్రభంజనమే అంటున్న ఎగ్జిట్ పోల్స్
Follow us

| Edited By: Ram Naramaneni

Updated on: May 19, 2019 | 9:17 PM

యావత్​ దేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు వచ్చేశాయి. జాతీయ మీడియా సంస్థలన్నీ మరోసారి ఎన్డీఏకి పట్టం కట్టాయి. ఏడు విడతలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్‌​ సహా ఇతర పార్టీల కంటే బీజేపీ మిత్రపక్షాలు దాదాపు 300 సీట్ల వరకు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నాయి.

దీంతో కేంద్రంలో మరోసారి కమలం వికసించినట్లేనని తెలుస్తోంది. మోదీ ప్రభంజనం ముందు విపక్షాలు ఓడిపోయినట్లేనని సర్వేలు తెలుపుతున్నాయి. ఎన్డీఏ కూటమి సంపూర్ణ అధిక్యంతో మరోసారి పగ్గాలు చేపట్టడం తథ్యమని.. తెలుస్తోంది.

ఇప్పటివరకు వెలువడ్డ ఎగ్జిట్​ పోల్స్​ అన్నీ ఏకపక్షంగా ఎన్డీఏకే జైకొట్టాయి. దాదాపు 300 సీట్లతో మోదీ టీం మరోమారు కేంద్రంలో అధికార పగ్గాలు చేపడుతుందని పేర్కొన్నాయి.

టైమ్స్​ నౌ సర్వే…

ఎన్డీఏ- 306 యూపీఏ- 132 ఇతరులు- 104

జన్​ కీ బాత్ సర్వే….

ఎన్డీఏ- 295-315 యూపీఏ- 122-125 ఇతరులు- 102-125

సీ-ఓటర్​ సర్వే…

ఎన్డీఏ- 287 యూపీఏ- 128 ఎస్పీ-బీఎస్పీ కూటమి- 40 ఇతరులు- 87

ఎబీపీ న్యూస్‌..

ఎన్డీఏ- 267

యూపీఏ-127

ఇతరులు-148

రిపబ్లిక్‌ టీవీ‌..

ఎన్డీఏ-287

యూపీఏ-129

ఇతరులు-127

ఎన్డీటీవీ..

ఎన్డీఏ-302

యూపీఏ-127

ఇతరులు-133

టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా..

ఎన్డీఏ-306

యూపీఏ-152

ఇతరులు-84

ఇండియా టుడే..

ఎన్డీఏ-232-251

యూపీఏ-73-99

ఇతరులు-56-74

సీఎన్ఎన్‌-ఐబీఎన్‌…

ఎన్డీఏ-336

యూపీఏ-82

ఇతరులు-124

టుడేస్‌ చాణక్య..

ఎన్డీఏ-340

యూపీఏ-70

ఇతరులు-132

నేత-న్యూస్​ ఎక్స్​ మాత్రం కాస్త భిన్నమైన అంచనాలు వెలువరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి ఎన్డీఏ కాస్త వెనుకపడుతుందని లెక్కగట్టింది. ఎన్డీఏకు 242, యూపీఏకి 164 సీట్లు రావచ్చని విశ్లేషించింది.