వైసీపీకి జై కొట్టిన సీపీఎస్ సర్వే

ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో విపక్ష వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మరో సర్వే అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని సీపీఎస్ అనే సర్వే సంస్థ అభిప్రాయపడింది. టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు, జనసేనకు కేవలం 1 సీటు వస్తుందని ఈ సర్వే తేల్చింది. అయితే ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో అధికార టీడీపీ గెలిచే అవకాశం ఉందని సర్వేల్లో తేలగా… ప్రతిపక్ష వైసీపీ […]

వైసీపీకి జై కొట్టిన సీపీఎస్ సర్వే
Follow us

| Edited By:

Updated on: May 19, 2019 | 10:06 PM

ఏపీలో జరిగిన తాజా ఎన్నికల్లో విపక్ష వైసీపీ భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని మరో సర్వే అంచనా వేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 130 నుంచి 133 సీట్లు వస్తాయని సీపీఎస్ అనే సర్వే సంస్థ అభిప్రాయపడింది. టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు, జనసేనకు కేవలం 1 సీటు వస్తుందని ఈ సర్వే తేల్చింది. అయితే ఇప్పటివరకు వెలువడిన అనేక సర్వేలు… ఏపీలో అధికార టీడీపీ గెలిచే అవకాశం ఉందని సర్వేల్లో తేలగా… ప్రతిపక్ష వైసీపీ గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ తమ సర్వేలో స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్లశాతాన్ని కూడా ఈ సంస్థ వెల్లడించింది. వైసీపీకి 49.04 శాతం, టీడీపీకి 41.02 శాతం, జనసేనకు 7.03 శాతం, ఇతరులకు 2.01శాతం ఓట్లు వస్తాయని తెలిపింది.

2006 నుంచి ఈ సంస్థ పలు ప్రీ పోల్ సర్వేలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2009లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో షెఫాలజీ సర్వేలను నిర్వహించామని.. అలాగే 2014లో తెలంగాణకు సంబంధించి ఈ సర్వే నిర్వహించామని చెప్పుకుంది. ప్రస్తుతం 2019 ఎన్నికలకు సంబంధించి ఖచ్చితమైన ఫలితాలను అంచనా వేసినట్లు తెలిపింది.

తెలంగాణకు సంబంధించి 2018లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో కూడా ఈ సంస్థ సర్వే చేపట్టింది. 90 సీట్లకు గాను 88 సీట్లలో టీఆర్ఎస్ విజయకేతనం ఎగరవేసిందని.. అలాగే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లకు గాను 98 సీట్లు టీఆర్ఎస్ గెలుస్తోందని ప్రెడిక్ట్ చేశామని వెల్లడించింది.

అలాగే నారాయణ్‌ఖేడ్, పాలేరు ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపును కూడా ఊహించామని ఈ సంస్థ పేర్కొంది. అయితే ఏపీలో వైసీపీ గెలుస్తోందని ఈ సంస్థ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది.

దీదీకి బీజేపీ చెక్ పెట్టేసినట్లే : ఇండియా టుడే సర్వే

రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌లో కమలం క్లీన్ స్వీప్… ఇండియా టుడే సర్వే

తమిళనాట డీఎంకే ప్రభంజనమంటున్న ఇండియాటుడే సర్వే