లగడపాటి సర్వే సమగ్ర వివరాలు

ఆంధ్రా ఆక్టోపస్‌గా  పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.  ఆయన  చెప్పినట్లుగానే తిరుపతి స్వామివారి సన్నిధిలో సర్వే ఫలితాలను వివరించారు. ఇవి శాస్త్రీయంగా జరిగిన సర్వే అని ఎవరి ఒత్తిళ్లు తనపై లేవన్నారు. ముందుగా తెలంగాణలోని పార్లమెంట్ ఫలితాలపై లగడపాటి తన టీం అంచనాను వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు…కాంగ్రెస్‌కు 0 నుంచి 2 వరకు..అలాగే బీజేపీ 0 నుంచి 1 […]

లగడపాటి సర్వే సమగ్ర వివరాలు
Follow us

|

Updated on: May 19, 2019 | 7:11 PM

ఆంధ్రా ఆక్టోపస్‌గా  పేరుగాంచిన లగడపాటి రాజగోపాల్ తన ఆర్జీ ఫ్లాష్ టీం చేసిన ఎగ్జిట్ పోల్స్ విడుదల చేశారు.  ఆయన  చెప్పినట్లుగానే తిరుపతి స్వామివారి సన్నిధిలో సర్వే ఫలితాలను వివరించారు. ఇవి శాస్త్రీయంగా జరిగిన సర్వే అని ఎవరి ఒత్తిళ్లు తనపై లేవన్నారు.

ముందుగా తెలంగాణలోని పార్లమెంట్ ఫలితాలపై లగడపాటి తన టీం అంచనాను వివరించారు. తెలంగాణలో టీఆర్ఎస్‌కు 14 నుంచి 16 ఎంపీ సీట్లు…కాంగ్రెస్‌కు 0 నుంచి 2 వరకు..అలాగే బీజేపీ 0 నుంచి 1 సీటును గెలుచుకొనే అవకాశం ఉందని చెప్పారు. తెలంగాణలోని ప్రజలందరూ సంపూర్ణంగా టీఆర్‌‌ఎస్‌కు మద్ధతు పలికారని తెలిపారు.

ఇక ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై ఆయన స్పందిస్తూ తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి రాబోతోందని తెలిపారు. ప్రస్తుతం జరుగుతోన్న సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్రం పరిపూర్ణంగా కొనసాగలంటే ప్రజలు చంద్రబాబువైపు నిలబడాలని నిర్ణయించుకున్నారని అన్నారు.

అలాగే ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ అన్ని చోట్లా గట్టి పోటి ఇచ్చిందని తెలిపారు. జగన్ సారధ్యంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా గణనీయమైన ప్రజా మద్దతుతో మంచి సీట్లు సంపాదించారని..కాకపోతే అధికారం ఒకరికే కాబట్టి టీడీపీ విజయం సాధించబోతోందని చెప్పారు.

ఇక జనసేనాని పవన్ కళ్యాణ్  సారథ్యంలోని  జనసేన కూడా కొన్ని చోట్ల గట్టి పోటి ఇచ్చిందని…ప్రస్తుతం జరిగిన ఎన్నికలు త్రిముఖ పోటీ అని రాజగోపాల్ అన్నారు.

ఎలక్షన్ మేనేంజ్‌మెంట్‌తో పాటు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం..తెలుగుదేశం 100 స్థానాలకు 10 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రాబోతాయని తెలిపారు. వైసీపీ 72 సీట్లకు ఒక 7 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రావొచ్చని తెలిపారు. ఇక మిగిలిన పార్టీలన్ని కలిపి 3 సీట్లకు 2 సీట్లు తక్కువ లేదా ఎక్కువ రావొచ్చని తెలిపారు.

అలాగే ఓటింగ్ శాతం విషయానికి వస్తే టీడీపీకి 43 శాతానికి 1 శాతం తక్కువ లేదా ఎక్కువ ఉండొచ్చని తెలిపారు. అలానే వైసీపీకి 41 శాతానికి కొంచెం అటు, ఇటుగా ఉంటుందని తెలిపారు. ఇక జనసేన 11 శాతానికి కొంచెం ఇంచుమించు తేడాలతో ఓటింగ్ షేర్ రాబడుతోందని తెలిపారు.

ఇక ఏపీలో పార్లమెంట్ సీట్ల విషయానికి వస్తే 15 సీట్లకు 2 స్థానాలు పెరిగొచ్చు లేదా తగ్గొచ్చని అన్నారు. వైసీపీ 10 సీట్లకు 2 సీట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చని తెలిపారు. ఇక ఇతరులకు 1 సీటు రావొచ్చు లేదా రాకపోవచ్చని అన్నారు. చాలా లోతైనా అధ్యయనం చేసి సర్వే చేశామని తెలిపారు.  ఏపీలో నియోజకవర్గానికి 1200 శాంపిళ్లు లీసుకుని ఈ సర్వే నిర్వహించినట్టు తెలిపారు. అయితే 110 నుంచి 120 స్థానాల్లోనే శాంపిళ్లు సేకరించామని అన్నారు.

ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
ఆ జియో ప్లాన్స్‌తో అధిక డేటా మీ సొంతం..!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
కళ్లు ఉప్పుతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. తప్పక తెలుసుకోండి!
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
ప్రపంచ యుద్ధ సమయంలో మలేరియా విధ్వంసం.. లక్షలాది సైనికులు మృతి  
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
సోయాబీన్స్‌తో బోలేడన్నీ లాభాలు..! ఆడవారిలో వచ్చే ఈ సమస్యలకు చెక్
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
పీఎం కిసాన్ లబ్ధిదారులకు అలెర్ట్.. ఆ పని చేస్తే అసలుకే ఎసరు
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
వేసవిలో ఎక్కువగా చెమటలు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయండి..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
మరింత వేగంగా వాట్సాప్.. త్వరలో రానున్న కొత్త ఫీచర్..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
డయాబెటిస్‌లో పుచ్చకాయ తినడం మంచిదేనా..? తింటే ఏమవుతుంది
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
హాట్..హాట్ సమ్మర్‌లో కూల్ కూల్ కూలర్స్..తక్కువ ధరలో ది బెస్ట్ ఇవే
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
చంద్రగిరి వైసీపీ అభ్యర్థి నామినేషన్లో పాల్గొన్న ముఖ్య నేతలు..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం..
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
సస్పెన్షన్‌కు గురైన సబ్‌రిజిస్ట్రార్‌ ఇంట్లో సోదాలు. ఇన్ని కోట్ల?
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
వేసవిలో పచ్చి ఉలిపాయలు తినండి.. మార్పు మీరే గమనించండి.
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
జీవితంలో ఇక పెళ్లి చేసుకోను.! షాకిచ్చిన యంగ్ హీరో రాజ్ తరుణ్..
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
మంజుమ్మల్ బాయ్స్‌ హీరోతో తెలుగు హీరోయిన్ అపర్ణ పెళ్లి.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
పోలీస్‌ కూతురు.. పోలీస్‌ కాబోయి హీరోయిన్ అయిందిగా.!
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మీరు వింటున్న రూమర్స్ అన్నీ నిజమే. సర్‌ప్రైజ్ షాకిచ్చిన డైరెక్టర్
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
మళ్లీ బయటికొచ్చిన బర్రెలక్క.. లోక్ సభ ఎన్నికల్లో పోటీ.!
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా
పర్సనల్ బాడీ గార్డ్‌ పెళ్లిలో ఫ్యామిలీతో క్రేజీ హీరో విజయ్ హంగామా