AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ట్రయల్ సెటిల్మెంట్.. జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి రూ.196కోట్ల నష్టపరిహారం..!

గతేడాది మిన్నియాపోలిస్‌లో శ్వేతజాతి పోలీసు చేతిలో చనిపోయిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించడానికి స్థానిక అధికార యంత్రాంగం అంగీకరించింది.

అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ట్రయల్ సెటిల్మెంట్..  జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి రూ.196కోట్ల నష్టపరిహారం..!
Minneapolis Approves Settlement With George Floyd Family
Balaraju Goud
|

Updated on: Mar 13, 2021 | 2:15 PM

Share

Settlement with George Floyd : ప్రపంచవ్యాప్తంగా సంచటన సృష్టించిన జాతి అహంకార దాడులపై అమెరికా సర్కార్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గతేడాది మిన్నియాపోలిస్‌లో శ్వేతజాతి పోలీసు చేతిలో చనిపోయిన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ కుటుంబానికి నష్టపరిహారంగా చెల్లించడానికి స్థానిక అధికార యంత్రాంగం సర్కార్ అంగీకరించింది. ఇందులో భాగంగా ఫ్లాయిడ్ ఫ్యామిలీకి 27 మిలియన్ డాలర్లు(భారత కరెన్సీలో సుమారు రూ.196కోట్లు)​చెల్లించేందుకు స్థానిక అధికారులు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని మిన్నెసోటా నగర లాయర్లు శుక్రవారం ఫ్లాయిడ్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అన్యాయంగా ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపేశారని, ఇది వారికి తగిన గుణపాఠం అని ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. కాగా, ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ట్రయల్ సెటిల్మెంట్ అని అగ్రరాజ్య న్యాయవాదులు తెలిపారు.

గతేడాది మే 25న ఫ్లాయిడ్‌ను అదుపులోకి తీసుకునే క్రమంలో శ్వేతజాతి పోలీస్​ఆఫీసర్ డెరెక్ చౌవిన్ క్రూరంగా ప్రవర్తించిన విషయం తెలిసిందే. ఫ్లాయిడ్‌ను కిందపడేసి అతని మెడపై డెరెక్ తన మోకాలితో నొక్కిపట్టడంతో ​ఊపిరాడక ఫ్లాయిడ్ చనిపోయాడు. తాను ఊపిరితీసుకోలేక పోతున్నా కాలును తొలగించాలని ఫ్లాయిడ్ వేడుకున్న డెరెక్ కనీకరించలేదు. ఈ ఘటనను స్థానికులు కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయింది. ఈ ఘటనపై అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. కరోనా మహమ్మారి విజృంభణ సైతం లెక్క చేయకుండా వీధుల్లోకి వచ్చి ఉద్యమించారు. దీంతో డెరెక్‌తో పాటు మరో ఇద్దరు పోలీస్ సిబ్బందిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

ఇక, ఫ్లాయిడ్​ మృతిని నిరసిస్తూ అతని కుటుంబసభ్యులు జూలైలో కోర్టును ఆశ్రయించారు. పౌర హక్కుల ఉల్లంఘనకు సంబంధించి దావా వేశారు. మిన్నియాపోలిస్‌ ఉన్నతాధికారులతో సహా నిందితులుగా ఉన్న మరో ముగ్గురు పోలీస్ అధికారులపై ఈ దావా దాఖలు చేశారు. దీంతో దిగొచ్చిన మిన్నియాపోలీస్ యంత్రాంగం న్యాయస్థానం వెలుపల పరిష్కారం చేసుకునే దిశగా ఫ్లాయిడ్ కుటుంబీకులను ఒప్పించింది. ఇందులో భాగంగా రూ.196కోట్ల నష్టపరిహారం చెల్లించేందుకు అంగీకరించింది.

తాజాగా ఈ ఒప్పందంపై ఫ్లాయిడ్ సోదరుడు రోడ్నీ స్పందించారు. ఇకపై నల్లజాతీయులపై తెల్లజాతీయుల దౌర్జన్యానికి దిగాలంటే కొంచెం ఆలోచిస్తారని ఆయన అన్నారు. అలాగే ‘తప్పుడు మరణానికి’ తగిన న్యాయం జరిగిందని ఫ్లాయిడ్ ఫ్యామిలీ లాయర్ బెన్ క్రంప్ పేర్కొన్నారు. ఇది అగ్రరాజ్యం చరిత్రలోనే అతిపెద్ద ప్రీ-ట్రయల్ సెటిల్మెంట్ అని ఆయన తెలిపారు.తమినాట ఆకట్టుకుంటున్న డీఎంకే మేనిఫెస్టో.. ప్రతీ మహిళకు రూ.1,000 ఫించన్‌, కోటి మందికి ఉద్యోగాలు

Read Also..