H1b Wages: అమెరికాలో ఇండియన్ ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. హెచ్1బీ వేతనాలపై కీలక ఆదేశాలు జారీ చేసిన బైడెన్.
Biden On H1b Wages: అమెరికా అధ్యక్ష పదవిని వీడుతోన్న సమయంలో ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను మార్చేసిన బైడెన్ తాజాగా..
Biden On H1b Wages: అమెరికా అధ్యక్ష పదవిని వీడుతోన్న సమయంలో ట్రంప్ తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలకు మార్పులు చేర్పులు చేసే పనిలో పడ్డారు అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న పలు నిర్ణయాలను మార్చేసిన బైడెన్ తాజాగా.. మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ వీసాల వేతనాలకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అమెరికాలో హెచ్1బీ వీసాతో పనిచేసే ఇతర దేశాలకు చెందిన ఉద్యోగుల కనీస వేతనాలను భారీ పెంచుతూ ట్రంప్ గతంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బైడెన్ ఈ నిబంధన అమలును మరింత ఆలస్యం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ నిబంధన అమలైతే నష్టం ఏంటి..?
కనీస వేతనం పెంచితే ఎవరికైనా మంచిదేగా.. ఈ నిబంధనను అమలు ఆలస్యం చేస్తే ఇండియన్స్‌కు ఏంటి లాభం అని ఆలోచిస్తున్నారు కదూ. హెచ్1బీ వీసా ఉన్న వారికి కనీస వేతనాన్ని పెంచితే అమెరికాలో ఉన్న కంపెనీలు విదేశీయులకు ఉద్యోగా అవకాశాలను తగ్గిస్తూ స్థానికంగా ఉన్న వారికే ఉద్యోగాలు ఇస్తాయనేది ట్రంప్ వ్యూహం. అందుకే ఈ నిబంధన ఉండకూడదని విదేశీయలు, ముఖ్యంగా భారతీయులు ఎక్కువగా కోరుకున్నారు. తాజాగా అమెరికా కార్మిక శాఖ ప్రచురించిన ఫెడరల్ నోటిఫికేషన్‌లో మే14 వరకు ఈ నిబంధనలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. తమ నిర్ణయం కొంతమంది విదేశీయుల తాత్కాలిక, శాశ్వత ఉద్యోగుల వేతన ప్రయోజనాలను కాపాడనుందని తెలిపింది. ఫలితంగా భారతీయ ఐటీ నిపుణులకు కూడా భారీ ప్రయోజనం చేకూరనుంది. ప్రస్తుతం అమలులో ఉన్న కాలపరిమితిని మరింత ఆలస్యం చేయాలా వద్దా అనే విషయాన్ని పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం ఇది మే 14 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. దీన్ని పొడిగించేముందు ప్రజల అభిప్రాయాలను స్వీకరిస్తామని పేర్కొంది. ఇదిలా ఉంటే ఈ నిర్ణయంపై ఫెడరేషన్ ఫర్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్(ఫెయిర్) సంస్థ తీవ్రంగా వ్యతిరేకించింది.
Also Read: నాన్ వెజ్ పిజ్జా పంపుతారా ? రూ.కోటి పరిహారం చెల్లించండి, శాకాహార మహిళ డిమాండ్