తమినాట ఆకట్టుకుంటున్న డీఎంకే మేనిఫెస్టో.. ప్రతీ మహిళకు రూ.1,000 ఫించన్, కోటి మందికి ఉద్యోగాలు
తమిళనాట రాజకీయ పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తోండగా.. ప్రతిపక్ష డీఎంకే హామీలతో ఎన్నికల మరో అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది.
DMK manifesto : తమిళ రాజకీయాలు రసవత్తరంగా సాగుతోండగా.. రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు ఎత్తులు.. పై ఎత్తులు వేస్తూ ముందుకు సాగుతున్నాయి. పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తోండగా.. ప్రతిపక్ష డీఎంకే హామీలతో ఎన్నికల మరో అడుగు ముందుకేసి ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించింది. తమిళనాడు అభివృద్ధి కోసం పదేళ్ల వ్యూహమంటూ ప్రణాళికను విడుదల చేసింది. రానున్న దశాబ్దకాలంలో తమిళనాడును అన్ని రంగాల్లో అగ్ర స్థానంలో నిలపడమే ఈ విజన్ లక్ష్యమని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ ప్రకటించారు.
తిరుచ్చిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో 10 ఇయర్స్ విజన్ ప్రకటించారు పార్టీ అధినేత స్టాలిన్. ఆర్థికం, వ్యవసాయం, నీటి నిర్వాహణ, విద్య ఆరోగ్యం పరిశుభ్రత, పట్టణాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయల కల్పన, సామాజిక న్యాయం అనే ఏడు రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ మేనిఫెస్టోకు రూపకల్పన చేశారు. ముఖ్యంగా యువతకు 75 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. రాబోయే పదేళ్లలో ప్రతీ ఏడాదికి పది లక్షల ఉద్యోగాల వంతున కోటి మందికి ఉద్యోగాలు కల్పిస్తామనని హామీనిచ్చారు స్టాలిన్. తద్వారా ప్రజలను పేదరికం నుంచి బయటపడేస్తామన్నారు.
అలాగే, రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నల్లా ద్వారా తాగునీరు అందించడంతోపాటు మంచినీటి వృధాను అరికడగతామని చెప్పారు. సామాజిక న్యాయంలో భాగంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల విద్యార్థులకు స్కాలర్‌షిప్పులు రెట్టింపు చేస్తామన్నారు. ఇక ప్రతీ గృహిణికి నెలకు వెయ్యి రూపాయల ఫించను అందిస్తామన్నారు. రేషన్ కార్డు ఉంటే చాలు.. మహిళలందరికీ నెలనెలా వెయ్యి రూపాయలు అందిస్తామని హామీనిచ్చారు.
రాష్ట్రంలో విద్య, వైద్యం, ఆరోగ్యానికి డీఎంకే అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు స్టాలిన్ తమ మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో 1.9 శాతంగా ఉన్న ఎడ్యుకేషన్ బడ్జెట్‌ను 6 శాతానికి పెంచనున్నట్టు ప్రకటించింది. 0.75 శాతం ఉన్న ఉన్న వైద్య ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను 2 శాతానికి పెంచుతామన్నారు. ప్రతీ గ్రామంలో హాస్పటల్, స్కూల్‌ను నిర్మించడంతో పాటు అందుకు తగ్గట్టు నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపారు.
డీఎంకే ఎన్నికల మేనిఫెస్టో ఓసారి పరిశీలిస్తేః
పదేళ్లలో 35 లక్షల కోట్లతో బడ్జెట్ రానున్న పదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పన పేదరికం నుంచి ప్రజలకు విముక్తి 36 లక్షల కుటుంబాలకు తాగునీరు స్కాలర్‌షిప్‌లు రెట్టింపు చేస్తామని హామీ ప్రతీ మహిళకు రూ.1,000 ఫించన్ విద్య, వైద్యం, ఆరోగ్యంపై స్పెషల్ ఫోకస్ ఎడ్యుకేషన్ బడ్జెట్ 6శాతానికి పెంపు వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్‌ను 2శాతానికి పెంపు ప్రతి గ్రామంలో స్కూల్, హాస్పిటల్ నిర్మాణం 16శాతంగా ఉన్న మురికివాడలు 5శాతానికి తగ్గింపు పట్టణ ప్రాంతాల్లో 9,75,000 కాంక్రీట్ ఇళ్ల నిర్మాణం గ్రామీణ ప్రాంతాల్లో 20 లక్షల మందికి ఇళ్లు 11.75 లక్షల హెక్టార్ల భూమి సాగులోకి తీసుకొస్తామని హామీ 20 లక్షల హెక్టార్లలో రెండు పంటలు పండించేందుకు చర్యలు వ్యవసాయరంగంలో నాణ్యమైన పద్దతులు అడవుల విస్తీర్ణం 25 శాతానికి తీసుకెళ్తామని హామీ హిందూ ఆలయాల పునరుద్ధరణకు రూ.వెయ్యి కోట్లు మసీదులు, చర్చిల పునరుద్ధరణకు రూ.200 కోట్లు ఆస్తిపన్ను పెంచబోమని ప్రకటించిన స్టాలిన్ నీట్ పరీక్షను తమిళనాడులో రద్దు చేస్తాం-స్టాలిన్ పదేళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాల్లో 40 శాతం మహిళలకు అవకాశం-స్టాలిన్ విధుల్లో ఉన్న పోలీస్ మృతిచెందితే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా తమిళనాడులో కరుణానిధి పేరుతో కలైంజర్ క్యాంటిన్ ఏర్పాటు జయలలిత మృతిపై విచారణ వేగవంతం అన్నాడీఎంకే మంత్రులపై అవినీతి విచారణకు ప్రత్యేక కోర్టు లీటర్ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.4, పాలపై రూ.3 తగ్గింపు జర్నలిస్టుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు గ్యాస్ సిలిండర్‌పై రూ.100 సబ్సిడీ
ఇదీ చదవండిః తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన మాజీ కేంద్ర మంత్రి యశ్వంత్ సిన్హా, పార్టీ ఉత్తేజితమయ్యేనా ?