గంజాయి స్మగ్లర్లకు చెక్ పెట్టిన అబ్కారీ అధికారులు

హైదరాబాద్ : నగరంలో తప్పించుకు తిరుగుతున్న గంజాయి ముఠాకు డీటీఎఫ్ అధికారులు చెక్ పెట్టారు. విశాఖపట్నం, అరకు కేంద్రంగా నగరంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు ఛేజ్‌చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక ఎస్‌ఐకి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 78కిలోల గంజాయి, రెండు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన […]

గంజాయి స్మగ్లర్లకు చెక్ పెట్టిన అబ్కారీ అధికారులు
Follow us

| Edited By:

Updated on: Mar 02, 2019 | 9:57 AM

హైదరాబాద్ : నగరంలో తప్పించుకు తిరుగుతున్న గంజాయి ముఠాకు డీటీఎఫ్ అధికారులు చెక్ పెట్టారు. విశాఖపట్నం, అరకు కేంద్రంగా నగరంలో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు నిందితులను మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డీటీఎఫ్ అధికారులు ఛేజ్‌చేసి పట్టుకున్నారు. ఈ ఘటనలో ఒక ఎస్‌ఐకి స్వల్ప గాయాలయ్యాయి. నిందితుల వద్ద నుంచి రూ.12 లక్షలు విలువ చేసే 78కిలోల గంజాయి, రెండు ద్విచక్రవాహనాలు, సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. మెదక్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన కేట్రోత్ శెట్టి, ఎర్కపల్లికి చెందిన చందర్‌జాదవ్, కామారెడ్డి జిల్లా పిట్లంకు చెందిన కేతావత్ భీర్‌సింగ్, సంగారెడ్డి జిల్లా వంగ్డల్‌కు చెందిన మానిక్ జాదవ్‌లతో కలిసి గంజాయి స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. విశాఖపట్నం, అరకు ప్రాంతం నుంచి గంజాయిని నగరానికి రైల్లో రవాణా చేసి, నగరంలో సరఫరా చేస్తున్నారు.

ఈ క్రమంలో నిందితులు గత నెల 28న రాత్రి లోకమాన్యతిలక్ రైలు నుంచి గంజాయి పార్సిల్స్‌ను మౌలాలి రైల్వేస్టేషన్‌లో డెలివరీ చేసుకున్నారు. అనంతరం శుక్రవారం ఉదయం గంజాయిని ద్విచక్ర వాహనాలపై తరలించేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న మల్కాజిగిరి డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సపావత్ శ్రీనివాస్‌నాయక్ తన బృందంతో కలిసి నేరేడ్‌మెట్ ఎక్స్‌రోడ్‌లో నిందితులను అడ్డగించగా, వారు పారిపోయేందుకు యత్నించారు. దీంతో ఆబ్కారీ అధికారులు స్మగ్లర్లను వెంబడించగా, ప్రధాన నిందితులైన కేట్రోత్ శెట్టి, చందర్‌జాదవ్‌లు తప్పించుకున్నారు. మానిక్ జాదవ్, భీర్‌సింగ్ అధికారులకు పట్టుబడ్డారు. నిందితులను అరెస్టుచేసి, వారి నుంచి గంజాయి, రెండు ద్విచక్రవాహనాలను స్వాధీ నం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మల్కాజిగిరి ఈఎస్ ప్రదీప్‌రావు పర్యవేక్షణలో జరిగిన ఈ దాడుల్లో జిల్లా డీటీఎఫ్ ఇన్‌స్పెక్టర్ సపావత్ శ్రీనివాస్‌నాయక్, మల్కాజిగిరి ఆబ్కారి స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎ.లక్ష్మణసింగ్, ఎస్‌ఐ షబ్బీర్ అహ్మద్ పాల్గొన్నారు.

Latest Articles
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
ఏపీలో నగదు బదిలీ ప్రక్రియపై ఈసీని అనుమతి కోరిన వైసీపీ..
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
కోహ్లీ కంటే అనుష్క పెద్దదా? ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
బుమ్రా సూపర్ స్పెల్.. ఆకట్టుకున్న అయ్యర్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
'మీరు వేసే ఓటు రాబోయే ఐదేళ్ల మీ భవిష్యత్తు'.. సీఎం జగన్..
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
శరీరంలో రక్తం గడ్డకట్టడానికి కారణాలు ఇవే.. ప్రాణాలకు ప్రమాదమే
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
సత్తు పిండి మంచిదని తెగ తింటున్నారా.? ఈ సమస్యలు తప్పవు
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
అందరూ అరివీర భయంకరులే.. టీ20 ప్రపంచకప్ కోసం విండీస్ జట్టు ఎంపిక
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
మూడో విడత పోలింగ్‌లో ఉన్నది వీరే.. ఎన్నికల ఏర్పాట్లు చకచకా..
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
వేసవిలో ప్రతి రోజూ పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..
ఏంటి..! నభా నటేష్‌కు ఇంకా గాయం మానలేదా..