ఒవైసీకి ధీటైన పోటీదారుడిని ఎంచుకున్న కాంగ్రెస్
హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఏ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉన్నాసరే హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎంకు తిరుగులేదు. ప్రతిసారి అక్కడ అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూనే వస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్‌కి గట్టి ప్రత్యర్ధిని సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై బలమైన అభ్యర్థిని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పరిశీలిస్తోంది. […]

హైదరాబాద్: ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం వేడెక్కుతోంది. బలమైన అభ్యర్థుల కోసం కాంగ్రెస్ తీవ్రంగా కసరత్తులు చేస్తోంది. ఏ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితి ఎలా ఉన్నాసరే హైదరాబాద్‌లో మాత్రం ఎంఐఎంకు తిరుగులేదు. ప్రతిసారి అక్కడ అసదుద్దీన్ ఒవైసీ గెలుస్తూనే వస్తున్నారు.
అయితే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీ అసదుద్దీన్‌కి గట్టి ప్రత్యర్ధిని సిద్ధం చేస్తోంది. హైదరాబాద్ నుంచి ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీపై బలమైన అభ్యర్థిని దింపాలని నిర్ణయించిన కాంగ్రెస్.. మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ను పరిశీలిస్తోంది. అజారుద్దీన్‌తో పాటు ఇటీవల శాసనసభ ఎన్నికల్లో నాంపల్లి నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్ అభ్యర్థిత్వాలను చురుకుగా పరిశీలిస్తోంది.



