Jabardasth Rajamouli: నాకు టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చింది.. కానీ వారిద్దరు అడ్డుపడ్డారు: జబర్దస్త్ రాజమౌళి
జబర్దస్త్ కామెడీ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కమెడియన్లలో రాజమౌళి ఒకడు. ముఖ్యంగా తాగు బోతు పాత్రలతో బాగా ఫేమస్ అయ్యాడీ నటుడు. అలాగే పేరడీ పాటలతోనూ బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. కొన్ని సినిమాల్లోనూ మెరిసిన రాజమౌళి తాజాగా చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది ఆర్టిస్టులు తమ ట్యాలెంట్ ను ప్రపంచానికి చాటి చెప్పారు. జబర్దస్త లో కంటెస్టెంట్లుగా, టీమ్ లీడర్స్ గా చేసిన వారిలో ఇప్పుడు చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, కమెడియన్లు, సహాయక నటులుగా మెప్పిస్తున్నారు. అలా జబర్దస్త్ కామెడీ షోతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాజమౌళి కూడా ఒకరు. ముఖ్యంగా తాగు బోతు పాత్రలతో ఇతను చేసే స్కిట్లు బుల్లితెర ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాయి. అలాగే సినిమా పాటలను కూడా పేరడీ సాంగ్స్ గా పాడుతూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి రాజమౌళి ఇప్పుడు జబర్దస్త్ లో ఎక్కువగా కనిపించడం లేదు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లోనూ కనిపిస్తున్న ఈ ట్యాలెంటెడ్ కమెడియన్ ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అలాగే జబర్దస్త్ గురించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
‘చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా తాగుబోతులా నటించడం అనేది నాకు కాలేజీ రోజుల నుంచే ఉంది. కొన్ని సార్లు నేను నిజంగానే తాగేసి వచ్చాను అనుకొని నన్ను స్టేజిపై నుంచి దింపేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇక నాకు జబర్దస్త్ మంచి పేరు తెచ్చిపెట్టింది. నాగబాబు నా స్కిట్స్ , నేను పాడే పేరడీ సాంగ్స్ ని బాగా ఎంజాయ్ చేసేవారు. నా ట్యాలెంట్ చూసి నాతో పాటు జీవన్ ని కలిపి ఒకసారి టీమ్ లీడర్స్ చేసారు మల్లెమాల శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు. దీంతో ఆనందంతో అందరికీ స్వీట్స్ కూడా పంచిపెట్టాం. అప్పటికి నేను కిర్రాక్ ఆర్పీ టీమ్, జీవన్ వెంకీ మంకీ టీమ్స్ లో కీ కంటెస్టెంట్స్ గా ఉన్నాం. మాకు టీమ్ లీడర్ ఇచ్చారని తెలిసి ఆర్పీ, వెంకీ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్లి వాళ్లకు టీమ్ లీడర్స్ ఇస్తే మా టీమ్స్ వీక్ అయిపోతాయి. మాకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ దొరికేదాకా వాళ్లకు టీమ్ లీడర్స్ ఇవ్వొద్దు అన్నారు. దాంతో మా టీమ్ లీడర్ పొజిషన్స్ ఆపేశారు. మళ్లీ కంటెస్టెంట్స్ గానే చేశారు.
ఇంటర్వ్యూలో జబర్దస్త్ రాజమౌళి..
View this post on Instagram
‘ ఇక నాగబాబు గారు వెళ్లియాక మళ్ళీ టీమ్ లీడర్స్ ఛాన్స్ ఇచ్చారు. కానీ అపుడు నా ఆరోగ్యం సరిగా లేదు. దీంతో అవకాశాన్ని వద్దనుకున్నాను. కానీ నాకు మొదటిసారి టీమ్ లీడర్ ఛాన్స్ వచ్చినప్పుడు ఆర్పీ, వెంకీ పోగొట్టారని తెలిసి నా మనసుకు చాలా బాధేసింది. పంచ్ ప్రసాద్ కి కూడా టీమ్ లీడర్ అయ్యాక హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. స్ట్రెస్ తీసుకోలేకపోయాడు. అది చూసి ఇంక నేను కూడా టీమ్ లీడర్ అవ్వకూడదు అనుకున్నా’ అని చెప్పుకొచ్చాడు రాజమౌళి. ప్రస్తుతం ఈ కమెడియన్ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..




