AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అత్యధిక ధనవంతుడు.. డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయాడు

దేశవ్యాప్తంగా 17వ లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఎన్డీయేనా..? యూపీయేనా..? అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో 348 సీట్లతో ఎన్డీయే ఇంతవరకు సాధించని గ్రాండ్‌ విక్టరీని నమోదు చేసుకుంది. కాగా ఈ ఎన్నికల్లో ధనవంతులు కూడా చాలామందే పోటీ చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో అత్యధిక ధనవంతులుగా పేరొందిన టాప్-10మంది ఎంపీ అభ్యర్థుల్లో ఐదుగురు ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో డబ్బు ఏ మాత్రం పనిచేయలేదని అర్థమైంది. మరో విశేషం ఏంటంటే.. అత్యధిక ధనవంతుడికి డిపాజిట్లు […]

అత్యధిక ధనవంతుడు.. డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయాడు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 25, 2019 | 1:37 PM

Share

దేశవ్యాప్తంగా 17వ లోక్‌సభ ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఎన్డీయేనా..? యూపీయేనా..? అన్నట్లు సాగిన ఈ ఎన్నికల్లో 348 సీట్లతో ఎన్డీయే ఇంతవరకు సాధించని గ్రాండ్‌ విక్టరీని నమోదు చేసుకుంది. కాగా ఈ ఎన్నికల్లో ధనవంతులు కూడా చాలామందే పోటీ చేశారు. ఎన్నికల అధికారులకు సమర్పించిన అఫిడవిట్‌లో అత్యధిక ధనవంతులుగా పేరొందిన టాప్-10మంది ఎంపీ అభ్యర్థుల్లో ఐదుగురు ఓడిపోయారు. దీంతో ఈ ఎన్నికల్లో డబ్బు ఏ మాత్రం పనిచేయలేదని అర్థమైంది. మరో విశేషం ఏంటంటే.. అత్యధిక ధనవంతుడికి డిపాజిట్లు కూడా రాలేదు.

బీహార్‌లోని పాటలీపుత్ర నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన రమేశ్ కుమార్ శర్మ.. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన రిచెస్ట్‌ మ్యాన్‌గా రికార్డులెక్కారు. అఫిడవిట్‌లో ఆయన తన ఆస్తుల విలువ 1,107కోట్లుగా చూపగా.. ఆయనకు 1,556 ఓట్లు మాత్రమే పడ్డాయి. బీజేపీ అభ్యర్థి రామ్ క్రిపల్ యాదవ్ చేతిలో ఘోర పరాజయం పాలైన రమేశ్ కుమార్, డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.

రెండో ధనవంతుడైన కొండా విశ్వేశ్వర్ రెడ్డి(అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.895కోట్లు) తెలంగాణలోని చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

మూడో ధనవంతుడిగా పేరొందిన నక్కుల్ మెహతా (అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.660కోట్లు) మధ్యప్రదేశ్‌లోని చింద్వారా నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు.

నాలుగో ధనవంతుడైన వసంతకుమార్(అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.417కోట్లు) కర్ణాటకలోని బెంగళూరు రూరల్ నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రాధాకృష్ణన్‌పై గెలుపొందారు.

ఐదో ధనవంతుడి పేరొందిన జ్యోతిరాధిత్య సింథియా(అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.374కోట్లు) ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ నుంచి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి.. బీజేపీ నేత డాక్టర్. కృష్ణపాల్ యాదవ్ చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు.

ఆరో ధనవంతుడైన పీవీపీ(అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.347కోట్లు) ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు.

ఏడో ధనవంతుడైన ఉదయ్ సింగ్ (అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.341కోట్లు) బీహార్‌లోని పుర్నియా లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి జేడీయూ అభ్యర్థి సంతోశ్ కుమార్ చేతిలో దారుణంగా ఓడిపోయారు.

ఎనిమిదో ధనవంతుడిగా పేరొందిన డీకే సురేశ్ కర్ణాటకలోని బెంగళూరు నుంచి పోటీ చేసి ప్రత్యర్థిపై గెలుపొందారు.

తొమ్మిదో ధనవంతుడైన కనుమూరు రఘురామ కృష్ణమ రాజు (అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.325కోట్లు) ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

పదో ధనవంతుడైన గల్లా జయదేవ్(అఫిడవిట్‌లో ఆస్తుల ప్రకారం రూ.305కోట్లు) ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.

నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
నేటి నుంచే కొత్త రైలు ఛార్జీల అమలు.. కిలోమీటర్‌కు ఎంత పెరిగిందంటే
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
వరుస సెలవులు, న్యూఇయర్‌ జోష్‌ పుణ్యక్షేత్రాలు కిటకిట
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
ఈఏడు కలెక్షన్స్‌లో టాలీవుడ్‌ డల్‌.. బాలీవుడ్ ఫుల్
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
2025లో వారసులను ఆహ్వానించిన టాప్ హీరోలు వీరే
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి