Corona kit: ఏపీలో లోకల్ కిట్.. ఇక 50 ని.ల్లో కరోనా టెస్ట్

కరోనా టెస్టు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ మరో కీలకమై ముందడుగు వేసింది. కేవలం 50 నిమిషాల్లో కరోనా టెస్టు పూర్తి చేసి, రిపోర్టు ఇచ్చేలా లోకల్ గా రూపొందించిన కరోనా కిట్‌ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది.

Corona kit: ఏపీలో లోకల్ కిట్.. ఇక 50 ని.ల్లో కరోనా టెస్ట్
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 08, 2020 | 12:54 PM

AP Govt produced local corona test kit: కరోనా టెస్టు నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ మరో కీలకమై ముందడుగు వేసింది. కేవలం 50 నిమిషాల్లో కరోనా టెస్టు పూర్తి చేసి, రిపోర్టు ఇచ్చేలా లోకల్ గా రూపొందించిన కరోనా కిట్‌ను ఏపీ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ కిట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిశీలించారు. ఒక్కో కిట్ ద్వారా రోజుకు 20 కరోనా టెస్టులు నిర్వహించే అవకాశం వుందని తెలుస్తోంది.

కరోనా నియంత్రణా చర్యలపై సీఎం జగన్ బుధవారం సమీక్ష జరిపారు. సమీక్షలో మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, ఆళ్ళ నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సావంగ్ పాల్గొన్నారు. కరోనా రాపిడ్ టెస్టు కిట్స్‌ను ఈ సమీక్షలో పరిశీలించారు. కరోనా పరీక్షలో కోసం ఏపీలో స్థానికంగా రూపొందించిన కిట్లను అందుబాటులోకి తెచ్చినట్లు మంత్రి గౌతమ్ రెడ్డి చెబుతున్నారు. విశాఖలోని పరిశ్రమల శాఖ మెడ్ టెక్ జోన్‌లో ఈ కరోనా టెస్టు కిట్లను రూపొందించినట్లు గౌతమ్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం వేయి కిట్లను అందుబాటులోకి తీసుకురానున్నది ప్రభుత్వం. కేవలం 50 నిమిషాల్లోనే కరోనా టెస్టు రిపోర్టును తెలుసుకునే వెసులుబాటు ఈ కరోనా కిట్ల ద్వారా కలుగుతుందని తెలుస్తోంది. ఒక్కో కిట్‌తో రోజుకు 20 కరోనా పరీక్షలు జరిపే అవకాశం వుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి వేయి కిట్లు మాత్రమే అందుబాటులోకి తెచ్చామని, మరో వారం రోజుల్లో పది వేల కరోనా రాపిడ్ టెస్టు కిట్లను అందుబాటులోకి తెస్తామని పరిశ్రమల శాఖా మంత్రి తెలిపారు.

రోజు రోజుకూ కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ర్యాండమ్ టెస్టులు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు గాను పెద్ద సంఖ్యలో కరోనా టెస్టు కిట్లు అవసరం అందుకే స్థానికంగా వీటిని తయారు చేసుకుంటే మెరుగైన ఫలితాలు సాధించడంతోపాటు కరోనా నియంత్రణా చర్యలను మరింత పక్కాగా అమలు చేయవచ్చని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.