AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నేతన్నల ఉపాధి దిశగా కె.టి.ఆర్ చర్యలు

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 3058 మంది నిరుపేదలకు నివాస స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండవద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్నమని, దానిని సాకారం చేసేందుకే రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఇటీవల ముఖ్యమంత్రి వద్ద ఈ ఏడాది సిరిసిల్లకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల ప్రస్తావన వచ్చిందని […]

నేతన్నల ఉపాధి దిశగా కె.టి.ఆర్ చర్యలు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 21, 2019 | 4:30 PM

Share

తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో 3058 మంది నిరుపేదలకు నివాస స్థలాలకు సంబంధించిన క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇళ్లులేని నిరుపేదలు ఉండవద్దనేది ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వప్నమని, దానిని సాకారం చేసేందుకే రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు.

ఇటీవల ముఖ్యమంత్రి వద్ద ఈ ఏడాది సిరిసిల్లకు ఇచ్చిన బతుకమ్మ చీరల ఆర్డర్ల ప్రస్తావన వచ్చిందని ఆ సందర్భంగా గతేడాది ఇచ్చిన చీరల డిజైన్లకంటే మరింత ఆకర్షణీయంగా ఈ సారి ఉండేలా చర్యలు తీసుకోవాలంటూ చెప్పారన్నారు. ఇందుకోసం ప్రస్తుతం కేటాయించిన నిధులకంటే అదనంగా రూ.20కోట్లు కేటాయించినా ఫర్వాలేదన్నారని తెలిపారు.

ఇటీవల పంపిణీ చేసిన బతుకమ్మ చీరలతో సిరిసిల్ల నేతన్నల కళానైపుణ్యం రాష్ట్రం నలుమూలలకు చేరిందన్నారు. కార్మికులకు వస్త్రోత్పత్తిలో, మహిళలకు అపెరల్‌ పార్కులో ఉపాధి లభించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. పట్టణంలోని ఒక్కో కార్మికుని కుటుంబంలో నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల స్థిరమైన ఆదాయం లభించేలా చర్యలు ప్రారంభమయ్యాయన్నారు.

తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
తండ్రిని కిరాతకంగా కొట్టి చంపిన కొడుకు
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రపంచంలోనే అత్యంత దురదృష్టవంతుడు.. ఇప్పుడు కోటీశ్వరుడు!
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
ప్రమాదకర రసాయనాలతో చిక్కీ తయారీ.. వీడియో చూస్తే జన్మలో ముట్టుకోరు
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
అరటి పండు తింటే బ్లడ్‌ షుగర్ లెవల్స్ పెరుగుతాయా? నిపుణులు చెప్పేద
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
ప్రపంచంలో ఖరీదైన నీరు.. అక్కడ రూ.9వేలకు బాటిల్..కారణం తెలిస్తే..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
కేవలం 1 రూపాయికే 2GB డేటా, అపరిమిత కాల్స్‌, 30 రోజుల వ్యాలిడిటీ..
బతికుండగానే తల్లిని చంపేశాడు..
బతికుండగానే తల్లిని చంపేశాడు..
చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..
చలికాలం హెల్త్ కోసం గోల్డెన్ టిప్.. ఇలా తయారు చేసిన పాలు తాగితే..
30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్
30 ఏళ్లు దాటినా సక్సెస్ లేదా? ఈ 4 నంబర్ల వారికి అలర్ట్
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..
ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం గూగుల్ ఎమర్జెన్సీ లొకేషన్ సర్వీస్‌..