AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మోడీ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్

విజయవాడ: పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయి. దాడి చేసింది తామేనంటూ పాకిస్థాన్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. పాక్‌పై దాడి చేయాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఒకడుగు ముందుకేసి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. భారత్-పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొందని, కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాలని కోరారు. అయితే ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ […]

మోడీ రాజీనామాకు చంద్రబాబు డిమాండ్
Vijay K
| Edited By: |

Updated on: Feb 14, 2020 | 1:55 PM

Share

విజయవాడ: పుల్వామా ఉగ్రదాడి తర్వాత దేశ వ్యాప్తంగా నిరసనలు పెరుగుతున్నాయి. దాడి చేసింది తామేనంటూ పాకిస్థాన్‌లో ఉన్న జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. దీంతో పాకిస్థాన్‌పై ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి. పాక్‌పై దాడి చేయాలనే డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఒకడుగు ముందుకేసి ఐక్యరాజ్యసమితికి లేఖ రాశారు. భారత్-పాక్ సరిహద్దులో యుద్ధ వాతావరణం నెలకొందని, కలగజేసుకుని పరిస్థితిని అదుపులోకి తేవాలని కోరారు.

అయితే ఈ క్రమంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ స్పందిస్తూ పుల్వామా ఉగ్రదాడికి తమకూ ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆధారాలు చూపిస్తే విచారణ జరిపిస్తామని చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ స్పందన తర్వాత భారత్‌లో కొత్త రాజకీయ ఆరోపణలు తెరమీదకు వచ్చాయి.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి దాడిపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ఈ దాడి ఎందుకు జరిగిందని ప్రశ్నించారు. ప్రధాని మోడీనే ఆ దాడి చేయించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నించారా? అనే విధంగా పరోక్షంగా అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఆమె అభిప్రాయాన్ని బలపరుస్తూ చంద్రబాబు కూడా మాట్లాడారు.

ఉగ్రదాడి నుంచి రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్నికల కోసం ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ఏమైనా చేయగలరని విమర్శించారు. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్న పుల్వామా దాడికి నైతిక బాధ్యత వహిస్తూ మోడీ రాజీనామా చేయాలని అన్నారు.

గతంలో ఒకసారి కశ్మీర్‌లో ఉగ్రదాడి జరిగింది. అప్పుడు మోడీ గుజరాత్‌కు సీఎంగా ఉన్నారు. ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నారు. ఆ సమయంలో మోడీ స్పందిస్తూ మన్మోహన్ రాజీనామా చేయలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఇప్పుడు మోడీ కూడా రాజీనామా చేయాలని అన్నారు. ఆ మాటలే మోడీకి కూడా వర్తిస్తాయని చంద్రాబు అన్నారు.

పార్టీ సమన్వయ కమిటి సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పుల్వామా ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. మన రక్షక దళాలకు అండగా ఉంటాం. కానీ ఈ దాడిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే మాత్రం అనుమతించబోమని చంద్రబాబు చెప్పారు. ఈ క్రమంలోనే పుల్వామా ఉగ్రదాడికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ రాజీనామా చేయాలని చంద్రబాబు అన్నారు.