ఏపీలో ఓట్ల తొలగింపు అవాస్తవం-ద్వివేది

అమరావతి: ఓటరు జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. ఎన్నికల నాటికి తప్పులన్నీ సరి చేస్తామని తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు అవాస్తవమని.. అలాంటి వార్తలు నమ్మొద్దని ద్వివేది చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో బూత్‌ స్థాయి అధికారులతో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫారం 6, 7, 8 తో పాటు ఓటర్ల జాబితాతో బూత్‌ స్థాయి అధికారులు వస్తున్నారని […]

ఏపీలో ఓట్ల తొలగింపు అవాస్తవం-ద్వివేది
Follow us

|

Updated on: Feb 21, 2019 | 4:00 PM

అమరావతి: ఓటరు జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది ఖండించారు. ఎన్నికల నాటికి తప్పులన్నీ సరి చేస్తామని తెలిపారు. అమరావతిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఓట్ల తొలగింపు అవాస్తవమని.. అలాంటి వార్తలు నమ్మొద్దని ద్వివేది చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో బూత్‌ స్థాయి అధికారులతో ప్రత్యేక క్యాంపు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఫారం 6, 7, 8 తో పాటు ఓటర్ల జాబితాతో బూత్‌ స్థాయి అధికారులు వస్తున్నారని తెలిపారు. వీటిపై అనుమానాలు ఉన్నవారు, ఓటర్ల జాబితాలో నమోదు కాని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ద్వివేది సూచించారు.