జీఎస్టీ అధిక౦గా వసూలు చేస్తున్న ‘మల్టీప్లెక్స్’లపై చర్యలు

మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్లకు సంబంధించి జీఎస్టీ పన్ను వసూళ్ల వ్యవహారంపై ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌ కేసులు నమోదు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాల్లో వసూలుచేస్తున్న పన్నురేట్లను వారు పరిశీలిస్తున్నారు. తగ్గించిన జీఎస్టీని జనవరి ఒకటో తేదీనుంచి వసూలు చేయాల్సి ఉంది. గతంలో వంద రూపాయలు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న టికెట్‌లపై 28 శాతం జీఎస్టీ ఉండేది. రూ.వంద లోపు ఉన్న టికెట్‌లపై 18 శాతం పన్ను […]

జీఎస్టీ అధిక౦గా వసూలు చేస్తున్న 'మల్టీప్లెక్స్'లపై చర్యలు
Theatre
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 6:04 PM

మల్టీప్లెక్స్‌లలో సినిమా టికెట్లకు సంబంధించి జీఎస్టీ పన్ను వసూళ్ల వ్యవహారంపై ఇప్పటికే హైదరాబాద్‌, రంగారెడ్డి జీఎస్టీ కమిషనరేట్‌ కేసులు నమోదు చేయడం విదితమే. ఈ నేపథ్యంలో దిల్లీ, ముంబయి, చెన్నై, బెంగళూరు నగరాల్లో వసూలుచేస్తున్న పన్నురేట్లను వారు పరిశీలిస్తున్నారు.

తగ్గించిన జీఎస్టీని జనవరి ఒకటో తేదీనుంచి వసూలు చేయాల్సి ఉంది. గతంలో వంద రూపాయలు, అంతకంటే ఎక్కువ ధర ఉన్న టికెట్‌లపై 28 శాతం జీఎస్టీ ఉండేది. రూ.వంద లోపు ఉన్న టికెట్‌లపై 18 శాతం పన్ను ఉంటుండేది. జీఎస్టీ కౌన్సిల్‌ ఆ పన్నురేట్లను 28 శాతం నుంచి 18 శాతానికి, 18 శాతం ఉన్నవాటిని 12 శాతానికి తగ్గించింది.

తగ్గించిన పన్నురేట్లు కాకుండా పాత పన్నును ప్రసాద్‌ మల్టీప్లెక్స్‌లో వసూలుచేయడంపై ఇటీవల హైదరాబాద్‌ జీఎస్టీ అధికారులు కేసు నమోదుచేశారు. సినీ హీరో మహేష్‌బాబుకు చెందిన గచ్చిబౌలిలోని ఏఎంబీ సినిమాస్‌లో పాత జీఎస్టీనే సినిమా టికెట్లపరంగా వసూలు చేస్తుండటాన్ని రంగారెడ్డి అధికారులు గమనించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.