AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KRMB Letter: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలి.. తెలంగాణ జెన్కోకు కేఅర్ఎంబీ లేఖ

తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు కేఅర్ఎంబీ లేఖ రాసింది.

KRMB Letter: తెలంగాణ విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలి.. తెలంగాణ జెన్కోకు కేఅర్ఎంబీ లేఖ
Krmb
Balaraju Goud
|

Updated on: Jul 15, 2021 | 8:32 PM

Share

KRMB Letter to Telangana Genco:

KRMB Letter to Telangana Genco: గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల మధ్య వేడి పుట్టిస్తున్న కృష్ణా జలాల వివాదంపై కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు స్పందించింది. తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న విద్యుత్ ఉత్పత్తికి నీటి వినియోగం ఆపాలని తెలంగాణ జెన్కోకు కేఅర్ఎంబీ లేఖ రాసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నీటి విడుదల ఆపాలని ఆదేశించింది. ఇందులో భాగంగా శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల జల విద్యుత్ ప్రాజెక్టులో నీటి విడుదల తక్షణం ఆపాలని ఆదేశాలు జారీ చేసింది. విద్యత్ ఉత్పత్తి నీరు ఇరిగేషన్ లేదా త్రాగునీటి ఉపయోగపడేలా ఉండాలని రెండు రాష్ట్రాల మధ్య అంగీకారం ఉందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది.

అయితే, గత కొంతకాలంగా మాటకు మాట.. లేఖకు లేఖ.. అన్నట్టుంది తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం. కృష్ణా జలాల్లో వాటాలు, వినియోగం, విద్యుత్ ఉత్పత్తిపై రెండు ప్రభుత్వాలు సీరియస్‌గానే ముందుకెళ్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ కేంద్రానికి కూడా లేఖ రాశారు. విద్యుత్ ఉత్పత్తిని ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటు తెలంగాణ ప్రభుత్వం లెటర్‌తోనే కౌంటరిచ్చింది. కృష్ణా రివర్‌ బోర్డుకు లేఖ రాసింది కేసీఆర్ సర్కార్. ఈనెల 9న జరగాల్సిన KRMB సమావేశాన్ని వాయిదా వేయాలని అందులో కోరింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి కేటాయింపులను పునఃసమీక్షించాలని లేఖలో కోరింది టీఎస్ ప్రభుత్వం. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాలు ఆపేందుకు ప్రతిపాదన చేయాలని కోరింది. ఈనెల 20తర్వాత బోర్డు సమావేశం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం విన్నపం. మరోవైపు.. పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతిచ్చినందుకు.. తెలంగాణకు 45 టీఎంసీల కృష్ణా నీటిని అదనంగా కేటాయించాలని కోరింది సర్కార్.

తెలుగురాష్ట్రాల మధ్య నీళ్ల మంటకు.. లేఖాస్త్రాలు మరింత అగ్గిరాజేస్తున్నాయి. జల జగడం ఎప్పుడు ఎటువైపు టర్న్ అవుతుందోనన్న అలజడి మొదలైంది. శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ.. కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎప్పుడైతే నీటి ప్రవాహాలు తగ్గుతాయే అప్పుడు మాటల యుద్ధం, వాటాల కొట్లాట కామన్‌గా మారుతోంది.

శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్‌ కేంద్రం నుంచి తెలంగాణ జెన్‌కో విద్యుదుత్పత్తి చేస్తుండడంతో ఏపీకి తీవ్ర నష్టం జరుగుతుందని కేఆర్‌ఎంబీకి ఏపీ ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. స్పందించిన కేఆర్‌ఎంబీ.. శ్రీశైలం ఎడమగట్టు నుంచి విద్యుత్‌ ఉత్పత్తి ఆపాలని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో రిప్లయ్‌గా కేఆర్‌ఎంబీకి సుదీర్ఘ లేఖ రాశారు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌.

ఇదిలావుంటే, శ్రీశైలం జల విద్యుత్‌ ప్రాజెక్టు ప్రారంభించిన సమయంలో ప్లానింగ్‌ కమిషన్‌.. కృష్ణా మొదటి ట్రైబ్యునల్‌ పూర్తి స్థాయిలో విద్యుత్‌ వినియోగానికి అనుమతి ఇచ్చిందని ఈఎన్‌సీ లేఖలో గుర్తు చేశారు. అందుకు అనుగుణంగానే విద్యుదుత్పత్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం 1991 నుంచి ఏప్రిల్‌, మే నెలలో ఏరోజూ కూడా 834 అడుగులకుపైగా నీటి మట్టం ఉండేలా చూడలేదన్నారు. ఇప్పుడు మాత్రం 854 అడుగుల పైన నీటిమట్టం ఉండాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. బేసిన్‌ వెలుపలకు కృష్ణా జలాలను తరలించేందుకే ఏపీ ప్రభుత్వం ఈ వాదనను వినిపిస్తోందని అభ్యంతరం వ్యక్తం చేశారు ఈఎన్‌సీ. దీనిపై అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అభిప్రాయానికి రావాలని ఈఎన్‌సీ కేఆర్‌ఎంబీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. దీంతో జల జగడం రానున్న రోజుల్లో ఎటు దారితీస్తుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తెలుగు రాష్ట్రాల మధ్య మళ్లీ కొత్త వార్‌ తప్పదా అన్న చర్చ సాగుతోంది.

1

1